ఈ పుట ఆమోదించబడ్డది

జెందుచు శాతవాహన శకము దాటి ఇక్ష్వాకు, శాలంకాయన, బృహత్ఫలాయన, విష్ణుకుండిన, మాఠర వంశ్యుల రాజ్యకాలముల నధిగమించి నప్పటికి అనగా క్రీస్తు తర్వాత 500 ప్రాంతమునాటికి అంతవరకు చెల్లుచున్న ప్రాకృత, ద్రావిడ భాషలనుండి విడివడి తెలుగుభాష యొక రూపునొందెను. ఇంకను ఒక శతాబ్ది గడచిన కాని శాసన భాషగ తయారు కాలేదనవచ్చును. అంటే అంతకుముందు తెలుగు భాష యే మాత్రము లేదనికాదు; ఉన్నది.కాని 'నాగబు', 'సంవత్సరంబుళ్' కొన్ని ఊళ్ళపేర్లు మొదలగునవి.అచ్చటచ్చట శాసనములలోను, పొట్ట, అత్త, కరణి, వంటి పదములు హాలుని గాథాసప్తశతిలోను కానవచ్చుటయేగాని, వాక్యరూపములో భాష కనిపించుటలేదు. తెలుగుభాష వాడుక యందుండి యున్నచో కొన్ని తప్పులతో గూడిన పస సముదాయములు శాసనములందు లభించెడివియే. అప్పటి రాజులభాష ప్రాకృతము గనుక అప్పటి శాసనములన్నియు ప్రాకృతమునందే యున్నవను వాదమంత బాగులేదు.సామాన్య జనులు వ్రాయించిన చిన్న వాక్యముల శాసనములనేకములు అమరావతిలోను నాగార్జున కొండ దగ్గర, మరికొన్ని చోట్ల దొరికినవి. అవికూడా ప్రాకృతమునందే యున్నవి. కనుక తెనుగప్పటికి జనసామాన్యమునందు కూడ ధారళముగ మాట్లాడబడు చుండెనను కొనుటకు ఆధారము లేవియులేవు.కాని అనేక దేశ్య పదములు వాడుకలో నున్నమాట నిజము.వారు మాట్లాడు వాక్యము లెట్లుండునో చెప్పుట కష్టము. మనకు తెలుగు వాక్యములు గల మొదటి శాసనములు కొన్ని కడప మండలములో కనిపించును. అవి ఆరవ శతాబ్దమునుండి వ్రాయబడినట్లు తెలియుచున్నది. అప్పటికి దేశములో వాదుకయందున్న బ్రాహ్మీ లిపినే కొలది మార్పులతో తెలుగువారు కన్నడమువారు వాడుకొనిరి. అందుచే దీనిని తెలుగు-కన్నడ లిపియని పరిశోధకులు చెప్పుదురు. కన్నడలిపినుండి తెలుగులిపి కాకతీయులనాటినుండి అనగ పన్నెండవశతాబ్ది నుండి వేఱుపడెను. అయునను ఈ రెండు లిపుల పోలిక మిక్కిలి సన్నిహితముగ నుండును.

తెలుగక్కరములు:

మున్ముందు వ్రాయబడిన తెలుగు శసనములలో కడప మందలము కమలాపురం తాలూకాలోని కలమల్ల శాసనము మనకు లభించెడి వాటిలో మొదటిదిగా భావింపబడుచున్నది.ఇయ్యది క్రీ.ఆరవ శతాబ్దికి చెందినట్లు కనబడును.కన్నడ మందప్పటికొక శతాబ్దికి పూర్వమే శాసనములు ప్రారంభ