ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

తెలుఁగు జాతీయములు


అంకాపొంకాలు


కోపము, విరోధము, తీవ్రము

క. కింకరుల చేత సంతన్
లంకకు వేగం దెనందినన్ విని యంకా
పొంకాలు దరికొనంగని
రంకుశసాహససమర్థుఁ డగు దశముఖుఁడున్ రామాభ్యు. 7. 49

సీ. బెడిదమౌ శృంగార భీభత్సములకు నం
కాపొంకములు .....
                                   కవిసర్ప.
అంకురార్పణముు

అంకుర మన మొలక. మొల కెత్తించుట.
ప్రారంభ మని భావము.
ఏవేని శుభకార్యముల జేయఁబోవు నపుడు తొల్డొల్తఁ
గావింపఁబడు పని.

చ. హృదయమువ్రేఁ గొకింత శ్రమియించెను జెల్వపుఁగ్రొవ్వు
పెంపునం బొదలెడు రంభకున్ సవతిపోరు గణించుట
కంకురార్పణం బిది యిటు గొంత చేసితి న పేక్షిత మంతయు
నైనయట్ల యాసుదతియ చాలు దానికి నసూయయు
నున్నది మాట లారయ. కళాపూ. 2. 3.