ఈ పుటను అచ్చుదిద్దలేదు

అడ్దాలబ్బాయ్! నీతో కలసిఉన్నప్పుడు..

ఒకే దీపస్థంభం
వెలుగులీనుతుంది మనమధ్య
తీరం నావల బంధం మనది
నువ్వెకడున్నా.. నాదారిన నేను..
 తెరచాపెత్తి సాగిపోతా
తారానగరంలో అంతరిక్ష యానంలో
దిక్సూచివై నువ్వున్నప్పుడు
నీ పౌరహిత్యాన్ని వీక్షించాలని
ఉవ్విళ్ళూరుతూ నేను వస్తాను
ఎవరివో అనుమానాల చీకట్లను
చెరిపేస్తూ దారి చూపిస్తుంటావు.

యుద్ధ ప్రాతిపదికన ఆటలాడిస్తుంటావు
మాటలాడిస్తుంటావ్.. పోట్లాడిస్తుంటావ్..
నా స్నేహగంధం నిను చేరినట్టు
ఓ సంకేతం.. నువ్ తలపరికిస్తావ్

నీ గమ్మత్తు కళ్లతో నను తడిమేలోగా
పొద్దురేఖలు నాలో విచ్చుకుంటాయి

నేల మీది తారలు ఆరోజుకి మరుగవ్వగానే
రెండు చంద్రవంకలు మన పెదాలపైన వాలతాయి

అప్పుడప్పుడొచ్చే నీలి పున్నమి ఐనా
నా స్కూటరు నీతో కలిసి
నేల మీదే సాగిపోతుంది
నే గాల్లో తేలిపోతాను.
(ఒకప్పటి కాలేజీ నేస్తం.. ఇప్పటి సినీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తారానగరం: filmcity వచ్చినప్పుడల్లా.. ఎప్పటిలాగే)