ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇదికదా జీవితం..

ఆలోచనాలోచనాలు తెరతీసిన వేళ
అనుభవాలు ఎన్నిమార్లు ముప్పిరిగొన్నాయో
మూసిన కళ్ళలో పలికే తన్మయరాగాలు
లాలి పాడే ఆలంబనలో పవళింపే ఓ భాగ్యం
ఒక్కో భావన.. పిల్లగాలై తాకుతూ ఉంటే
వసంతం వరించి వచ్చినట్టు తలపుల గిలి
ముందరి విందులు ఊహకందవు
రేపటి రోజు ఎరుక ఎవరికి..ఈరోజు నీ లోకంలో నేను..
వారాంతపు వాకిట నిల్చొన్నప్పుడు
నేలా నింగీ నా నీడే..
స్నేహ తారల మిణుకులు నీ ముంగిలి చేరవ్..
బద్దకపు భాగ్యదేవతా! నువు నన్నావహించేవేళ
 వంటింట్లోంచి వినవచ్చే సన్నాయిగీతం.. “తినిపడుకోరాదూ!!”
అబ్బా! ఈ అవసరం లేని లోకంలో నే ఉండలేనా!!
ఏవేళైనా!! ఈవేళైనా... (ఓ సెలవుదినం అనుభూతి..)

రాయడం అసంకల్పితం

తప్పనిసరి స్పందనలు కొన్నుంటాయ్
మెలకువ వస్తే కళ్ళు తెరచుకున్నట్టు..
మెళకువ నేర్చితే నైపుణ్యం పెరిగినట్టు
చల్లదనానికి ఒళ్లు ఝల్లుమన్నట్టు..
మంచితనానికి రూపంలేనట్టూ..
చూసినేర్వాల్సినవి కొన్నుంటాయ్
తరగతిగదిలో బోర్డుమీద అక్షరాలు..
వలపుల మదిలో దాగలేని భావాలు
అవసరాలను తీర్చే అనుకరణలు.. వాటిని నేర్చే కారణాలు
వాటి కారకాలు.. ఎందుకు రాస్తున్నానంటే ఏంచెప్పను!!
తల్లి కడుపున పడడం అక్కడే ఉండడానికా!
మనం పుట్టడం ఏడుపు వినిపించడానికేనా!
మన చూపులో అనుభూతులో వాటి లోతులో
అనుగు కోడిపెట్టలా పొదగపెట్టుకోవడానికా! ఓ మాటైనా ఉండొద్దా!
మనమధ్య జట్టుకట్టుకోవడానికైనా..(బ్లాగ్ మిత్రులకు..)