ఈ పుట ఆమోదించబడ్డది

ఎవరి దారిని వారు సమర్థించుకొంటున్నారు. అటువంటి వారికి తత్త్వములలోని జ్ఞానధనము లభించదు.


"తత్త్వం"ను విడదీసి చూచితే తత్‌+త్వం అని తెలుసుకొన్నాము. తత్త్వం అన్నది అన్ని మతములలోను గలదు. ముఖ్యముగ హిందూ (ఇందూ) మతములోను, క్రైస్తవ మతములోను బాగా కనిపిస్తున్నది. అయినప్పటికి ఇటు హిందువులకు అటు క్రైస్తవులకు దీని అర్థ భావములు తెలియకుండ పోయినది. హిందువులలో సంస్కృతమును నేర్చినవారు అర్థము చెప్పగలుగు చున్నారు. కాని భావము తెలియకుండ పోయినది. ప్రతి పదార్థము చెప్పిన వారికి భావము ఏమిటో తెలియదు. తత్‌ అనగ తనకు భిన్నముగ ఉన్న ఆత్మ అని అనుకోవడములో పొరపడుచున్నారు. ఎందుకనగా భగవద్గీతలోకాని, బైబిలులోకాని మూడు ఆత్మలు సిద్ధాంత సహితముగ చెప్పబడియున్నవి. ఆ త్రైతాత్మ సిద్ధాంతమును ఎవరు గుర్తించని కారణమున తత్‌ అనబడునది రెండవ ఆత్మనో, మూడవ ఆత్మనో తెలియకుండపోయినది. కొందరికి ఆత్మల వివరమే అర్థముకాక తాను మొదటి ఆత్మనైన జీవాత్మననే తెలియదు. ఇక క్రైస్తవులలోనికి వస్తే మూడవ ఆత్మను అటుంచితే రెండవ ఆత్మ వివరము కూడ తెలియదు. ఈ విధముగ ప్రపంచములో అతి పెద్దదైన క్రైస్తవమతమందుకాని, ఇక్కడ ఒక స్థాయిలోనున్న హిందూమతములో గాని రెండవ ఆత్మ వివరము తెలియకుండ పోయినది.


తత్‌+త్వం = తత్త్వం అని వివరించుకొని చెప్పువారున్నప్పటికి, "త్వం" కు అర్థము తెలిసినప్పటికి ఆ "తత్‌" అనేది ఏదో స్పష్టముగ ఎవరికి తెలియకుండపోయినది. ఒకవేళ కొందరిలో మాకు తెలుసునను ధీమా ఉండినప్పటికి అది వారి గ్రుడ్డినమ్మకమే కాని అసలైన జ్ఞానదృష్ఠి లేదని చెప్పవచ్చును. అందువలన తత్‌ అనగ పరమాత్మ అని చెప్పుచున్నారు. ఒక జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోతే వానికి జన్మ ఉండదు. అలా ఐక్యమైనవాడే కర్మలేనివాడై శరీరముతో లేకుండును. ఇక్కడ అసలైన వివరానికి వస్తే