ఈ పుట ఆమోదించబడ్డది

చేయక మన తలయందు త్రికూట స్థానములో ధ్యాసనుంచితే అక్కడున్న ఆత్మ తెలియునని పెద్దల ఉద్దేశము. కావున మూటిలోవుండే మూల పురుషుని తెలియమన్నారు. శరీరములో మూడునాడులు కలియు త్రికూట స్థానమున మనస్సు నిలుపనివాడు, బాహ్యముగ ఆత్మను వెతుకువాడు ఎప్పటికి బ్రహ్మవేత్త కాలేడని నాల్గవ చరణములోని భావము.

-***-


------------12. తత్త్వము--------------


గుట్టు తెలిసి మసులుకొనరే సుజ్ఞానులార బట్టబయలు దీని
         భావమెల్లను గుట్టు తెలిసి నడుచుకొనరే


 1) గండుపిల్లి లోకమెల్ల పారజూచి ఏలగాను,
కొండ ఎలుక లొక్క రెండు కొలువు జేసేరా || గుట్టు||

 2) అండబాయక చిలుకలైదు అడవిగాచుచుండగాను,
పండు కోతులొక్క రెండు ప్రహరి తిరిగేరా || గుట్టు||

3) ముట్టు తప్పి గొడ్డురాలు మహిళకొక్క కొడుకు పుట్టి
గొప్పకొండలేడు మ్రింగి గురకపెట్టెరా || గుట్టు||

4) గుట్టు చప్పుడనక నొక్కడు ఉరికి మింటి కెగయగాను,
కుప్పిగంతులేసి పాము కరచి మ్రింగేరా || గుట్టు||

5) భువిని నోరులేని మిడత పులిని మ్రింగేను,
ఆ వార్త తెలిసి మేక యొకటి పకపక నవ్వేరా || గుట్టు||

6) ఈ వివరము అరసి చూడ అలవిగాదు ఎవరికైనను,
తెలివిగల యాగంటి గురుడు తానె తెలియురా || గుట్టు||


ఇక్కడ ఆరవ చరణములో ఈ తత్త్వ వివరము తెలుసుకొనుటకు ఎవరికి అలవిగాదు. తెలివిగల యాగంటి గురుడు తానే తెలియురా