ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మనాడులని అంటున్నాము. వాటిలో ముఖ్యమైనది సుషుమ్న అనబడు బ్రహ్మనాడి. ఈ బ్రహ్మనాడి శరీరములోని వెన్నెముక మధ్యభాగములో గుదస్థానము మొదలుకొని కపాల స్థానము వరకు వ్యాపించివున్నది. అట్లు వ్యాపించివున్న బ్రహ్మనాడి ఏడు నాడీకేంద్రములుగ విభజింపబడి ఉన్నది. ఆరు కేంద్రముల పైనగల ఏడవ నాడీకేంద్రము ఆత్మకు స్థానమై ఉన్నది. బ్రహ్మనాడిలో ఏడవ నాడీకేంద్రమైన మెదడులో ఆత్మ నివాస ముండుట వలన ఆత్మను దైవముగ లెక్కించుటవలన ఆరు నాడీ కేంద్రములను ఆరు శిఖరములుగ పోల్చి ఏడవ దానివిూదికి ఎగచూడ మన్నారు. శరీరములోని ఆత్మను తెలుసుకొనుటకు చేసిన ప్రయత్నమే ఈ తత్త్వము యొక్క ఉద్దేశము. కావున శరీరములోని నాడీకేంద్రములను కొండలుగ పోల్చి ఏడవకొండ మీద దేవుడున్నాడని ఏడవ నాడీ కేంద్రమునకు దృష్ఠిమరలునట్లు చేశారు.


 4. మూడు నదులు కలియుచోటు తెలియమన్నాడే
మూటిలోయుండే మూల పురుషుని చూడమన్నాడే ||శ్రీ గురు||

ఇంతకు ముందు శరీరములోని మూడునాడుల గురించి చెప్పు కొన్నాము. ఈ మూడునాడులు విడివిడిగ ఉండి క్రింది వరకు వ్యాపించి ఉన్నప్పటికి ఆ మూడు కలియుచోటు ఒకటి కలదు. అదియే మెదడు స్థానము. దానిని ఏడవ పెద్దనాడీ కేంద్రమని కూడ చెప్పుకొన్నాము. ఈ కేంద్రములో మూడునాడులు కలియుచున్నవి. ఈ ఏడవ కేంద్రములోనే ఆత్మ నివాసమని చెప్పుకొన్నాము. ఆత్మయే శరీరమంతటికి అన్ని నాడీ కేంద్రములకు మూలాధారమైవున్నది. ఈ విషయమును వివరించుటకు మూడునాడులను మూడునదులుగ పోల్చి మూడు నదులు కలియుచోటు తెలియమన్నారు. మనలోని మనస్సును బాహ్యచింతలయందు లగ్నము