ఈ పుట ఆమోదించబడ్డది

జీవాత్మకు తన మొదటి స్థానమును జ్ఞాపకము చేసి తిరిగి అక్కడికే పొమ్మని హితము ఈ చరణములో చెప్పారు.


 3. ఆరు శిఖరములపైన వెయ్యికాల్ల మంటపమన్నాడే
ఆరు శిఖరములు ఎక్కి ఎగచూడమన్నాడే ||శ్రీ గురు||

శిఖరము అనగ కొండ అగ్రభాగమని అర్థము. ఆరుకొండలు పూర్తి ఎక్కిన తర్వాత పైన ఏడవకొండ మీద వెయ్యికాల్లమంటపమున్నదట. వేయిస్థంభాల మంటపములో దేవుడు తప్ప ఎవరుంటారు. కావున దేవున్ని చూడాలంటే ఆరు శిఖరములను ఎక్కి పైన ఉన్న దేవున్ని ఎగ చూడమన్నారు. ఇదే విషయమును తెలియజేయుటకు ఏడుకొండల మీద వెంకటేశ్వరుడున్నాడని చెప్పుచుందురు. కొండల మీద దేవుడుంటే ఏడుకొండలేమిటి ఏకంగా ఎనభై కొండలైన ఎక్కి చూడవచ్చును. ఏడు కొండలు ఎక్కిన, ఎనభైకొండలు ఎక్కిన అక్కడ కనిపించేది శిలాప్రతిమ తప్ప ఏమి ఉండదు. అది ప్రతిరూపమైన ప్రతిమే తప్ప దేవుడు కాదు.

దేవుడు ఆత్మరూపములో ఉంటాడు కాని ప్రకృతి రూపమైన రాల్లు, నీల్లరూపములో ఉండడని పెద్దలంటుంటారు. అందువలన చిల్లరరాల్లకు మ్రొక్కుచుయుంటె చిత్తము చెడునుర అన్నారు. అట్లయితే ఈ తత్త్వములో ఏడు శిఖరములు ఎక్కి ఎగచూడమని ఎందుకన్నారని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి సమాధానము ఏమనగా! మన శరీరమే దేవాలయము అందులోని ఆత్మే దేవుడని కొందరు పెద్దలు అన్నారు కదా! దాని ప్రకారము శరీరములోని ఆలయ అమరికను గురించి చెప్పినదే ఈ తత్త్వము చరణము. మన శరీరములో మూడు లక్షల యాభైవేల నాడులు గలవని ప్రతీతి. అందులో అన్నిటికంటే పెద్దవి మూడని, అవియే ఇడ, పింగళ, సుషుమ్ననాడులని వాటినే సూర్య,చంద్ర,