ఈ పుట ఆమోదించబడ్డది

ముందున్న మనము ముడివిప్పుకోలేని వారమైనాము. కావున వారు కొంత మరుగుపెట్టి వ్రాసినవి తెలియకుండ పోయినవి. అందువలన తత్త్వముల వివరములు ఎవరు చెప్పుకోవడము లేదు.


అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు కొందరికి తత్త్వములు అర్థము కాక వాటిని తిక్క మాటల క్రిందికి జమకట్టారు. ఇవి వేదాలుకాదు, ఉపనిషత్తులు కాదు వీటిని ఎందుకు చదవాలని అంటున్నారు. ఎవరు ఏమనిన తత్త్వాలలో ఉన్నది జ్ఞానము యొక్క సారాంశమను మాట వాస్తవము. పూర్వము బోధకులైన గురువులు జ్ఞానము చెప్పునపుడు కూడ రహస్య ప్రదేశములోనే చెప్పెడివారు. బయటి అజ్ఞానుల ఎదుటకాని, జ్ఞానము విూద ఆసక్తిలేనివారి ఎదుటకాని చెప్పెడివారుకాదు. పూర్వకాలములో అందరూ అదే పద్ధతిని కొనసాగించుచుండిరి. కావున వారు తత్త్వములను కూడ నిగూఢముగానే వ్రాసి అందరికి అర్థము కాకుండ చేశారు. ఎవరికైతే జ్ఞానము విూద జిజ్ఞాసయుండునో వారికి మాత్రము అర్థమగునట్లు వ్రాశారు. బయటి చూపును వదలి లోచూపు పెట్టుకొన్న ఎవరికైన తత్త్వములు ఎంత నిగూఢముగ ఉండినప్పటికి అర్థము కాగలవు.


నేటి సమాజములో ఎందరో గురువులుగ చలామణి అగుచున్న బోధకులు, స్వాములు, పీఠాధిపతులు గలరు కదా! తత్త్వముల వివరము గురించి వారికి కూడ తెలియదా? అని కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఎవరైతే తత్త్వములుగ వ్రాయబడిన పాటలలో జ్ఞానము లేదంటున్నారో వారు ఎవరైన వారికి శరీరములోని ఆత్మజ్ఞానము తెలియదనియే చెప్పవచ్చును. నేడు బోధకులందరు ఎక్కువ శాతము బయటి జ్ఞానమునే బోధిస్తున్నారు. కొందరైతే ఏ జ్ఞానములేని రామాయణ ఇతిహాసములను చెప్పుకుంటున్నారు. ఈ విధముగ జరిగి పోయిన చరిత్రను జ్ఞానమనుకోవడము వలన, ఇంతకు ముందు జ్ఞానిగ ఉన్నవాని చరిత్రను చెప్పుకోవడము వలన, మనకు జ్ఞానము కలుగుచున్నదా లేక కాలక్షేపణ జరుగుచున్నదా అని యోచించక పోవడము