ఈ పుట ఆమోదించబడ్డది

అటువంటపుడు రాముని దేవాలయము తర్వాత ఆంజనేయుని దేవాలయము తయారైనవి. వీటి తర్వాత అనేకమైన దేవాలయములు తయారైనవి.


ఆధ్యాత్మిక విద్యలో భారత దేశము మొట్టమొదటిది. ప్రపంచములో అన్ని దేశములకంటే దైవజ్ఞానములో భారతదేశమే ప్రథమ స్థానములో ఉన్నది. మనము నివశించు దేశమునకు మొదట ఇందూదేశమను పేరుండెది. ఆ పేరు కొంత మార్పుతో హిందూదేశమని ఈ రోజుకు పిలువబడుచున్నది. అయినప్పటికి హిందూదేశమునకు భారతదేశమను రెండవ పేరు కూడ కొంతకాలమునకు ఏర్పడినది. వ్యవహరములలో హిందూదేశము అను పేరుకంటే భారతదేశమను పేరే ఎక్కువగలదు. మన దేశము అన్ని దేశములకంటే ఆధ్యాత్మిక జ్ఞానములో మొట్టమొదటిది. కావున ఈ దేశమునకు ఇందూ అని అర్థముతో కూడుకొన్న పేరును కల్గియున్నట్లు ఇందూదేశము అన్నారు. ఆనాటి జ్ఞానులుంచిన మొదటి పేరైన ఇందూ అను అర్థముకాని పదముకాని ఈనాడు లేదు. దైవ జ్ఞానములో ఆనాటికి ఈనాటికి ప్రథమ స్థానములోనే మనమున్నాము. ఇంకను కొంత వివరమును తెలుసుకొంటే ఈ విధముగ గలదు. భారత దేశము ఉత్తరభారతము, దక్షణభారతమను రెండు భాగములుగ ఉండెడిది. ఉత్తర భారతములోని వారికి సంస్కృత విద్యలో పాండిత్యము ఎక్కువగ ఉండెడిది. దక్షణభారతములో ఉన్నవారికి చదువుకాని సంస్కృత పాండిత్యముకాని లేకుండెడిది. కాని ఆధ్యాత్మిక విద్యలో గొప్పగొప్ప జ్ఞానులు దక్షణదేశములో ఉండెడివారు. దక్షణదేశము వారివలననే ఈ దేశమునకు ఇందూదేశమని పేరు వచ్చినది. ఇందూ దేశమంటే జ్ఞానుల దేశమని ఆనాటి అర్థము. ఈనాడు ఆ అర్థము ఏమాత్రము లేకుండ