ఈ పుట ఆమోదించబడ్డది

---------------7. తత్త్వము---------------


నేజూచినానే బ్రహ్మమునాలో నేజూచినానే సద్గురునాలో నేజూచినానే
నేజూచినానే తలలో తారకయోగమందు రంజిల్లు నాగురుని నేజూచినానే

  
  1. కన్నుల నడుమను సన్నపు దిడ్డిన తిన్నగా వెలిగేటి పున్నమి చంద్రుని నేజూచినానే ||నేజూ||

 2. పాలభాగమందు నీలజ్యోతులనడుమ నోలలాడుచున్న
పరలింగ మూర్తిని నేజూచినానే ||నేజూ||

 3. చూపులోపల పాపల నడుమను వ్యాపించి వెలిగేటి ఆపరంజ్యోతిని నేజూచినానే ||నేజూ||

 4. చక్షురాగ్రమునందు పశ్చిమవీథిని నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని
నేజూచినానే ||నేజూ||

 5. చందమామకు నడుమను కుండలాకృతిని ఆనందముగనున్న హరి
గోవిందుని నేజూచినానే ||నేజూ||


వివరము : ఇంతకుముందున్న తత్త్వములో బాహ్యముగ దేవున్ని తెలియ లేము అని తెలుసుకొన్నాము. ఆ విషయము తెలిసిన కొందరు అంతర్ముఖ జ్ఞానమును సంపాదించి బయటి చింతలు వదలివేసి శరీరము లోపలనే ఆత్మను దర్శించుకొన్న విధానమును ఇప్పటి తత్త్వములో తెలియజేశారు. వారు శరీరములో తెలుసుకొన్న విధానమును గురించి ఏమంటున్నారో క్రిందచూచెదము.


బ్రహ్మ అనగా పెద్ద అని అర్థము, బ్రహ్మము అనగా ప్రపంచములో అన్నిటికంటె పెద్దది దైవము. కనుక దేవున్ని బ్రహ్మము అని పిలుచు చున్నాము. బ్రహ్మ అనగా త్రిమూర్తులలో ఒకరైన మూడుతలల బ్రహ్మని