ఈ పుట ఆమోదించబడ్డది

4. నాసికముపై దృష్ఠి నడిపించుమన్న
నడిపించి హరిని నీవు నమ్మియుండన్నా
నమ్మి నవరత్నముల పీఠమెక్కన్న
పీఠమెక్కిన అంబ పిలుచునోయన్నా ||ఈ జన్మ||

నాశికము అనగ ముక్కు. ఈ తత్త్వములో నాశికముపై అన్నారు. నాశికాగ్రము (నాశికముపై) అంటే ఏమిటో తెలియక చాలామంది సాధకులు తికమకపడుచున్నారు. పై భాగమును అగ్రభాగము అని అంటాము. ముక్కు పై భాగమును నాశికాగ్రము అని ఆధ్యాత్మిక విద్యలో చాలా చోట్ల చెప్పారు. నాశికాగ్రముపై దృష్ఠి నిలుపమని పెద్దలు చెప్పితే అది అర్థముకాక, తమ మనోద్యాసను ముక్కు పై భాగమునగల ఏడవ కేంద్రములో నిలుపవలెనని తెలియక, బయటి దృష్ఠిని ముక్కు క్రిందికొన భాగములో నిలిపి చూచువారు కొందరు గలరు. మరి కొందరు ముక్కు పై భాగమైన కనుబొమల మద్య భాగములో చూపును నిలిపి చూచువారు గలరు. పై చూపుతో చూచు ఈ రెండు విధానములు తప్పని, చూపు అనగ మనోదృష్ఠి అయిన ధ్యాస అని, నాశికాగ్రము అనగ లోపల గల ఏడవ నాడీకేంద్రమని తెలియదు. ఏడవ నాడీ కేంద్రములో ఆత్మ నివాసమున్నది. ఏడవ కేంద్రములో మనో దృష్ఠిని నిలుపగా కొంతకాలమునకు ఆత్మ తెలియును, ఆత్మను తెలిసిన తర్వాత పరమాత్మను పొందవచ్చును. ఈ విషయమును తెలియజేయుచు పై తత్త్వములోని నాల్గవ చరణములో నాశికముపై దృష్ఠి నిలుపన్నా అన్నారు. ఆత్మ నివాసమును నవరత్న పీఠముగ వర్ణిస్తు, సప్తస్థానము చేరినవానిని పీఠమెక్కినవాడని అన్నారు. అంబ అనగ ఆత్మయని, ఆత్మద్వార పరమాత్మను చేరడమును అంబపిలుపని ఈ చరణములో చెప్పారు. ఈ విధముగ