ఈ పుట ఆమోదించబడ్డది

కర్మలను కట్టెలను పూర్తిగ కాల్చివేసుకొని మోక్షము పొందును. అందువలన తలుపుతీసిన అంబ తేజమిచ్చునన్నా తేజమందినవాడు తాగురుడోయన్నా అని రెండవ చరణములో రెండవవాక్యమునందు చెప్పారు. మూడారు వాకిల్లు శరీరములోని తొమ్మిది రంధ్రములని, తలుపు తీయడమంటే యోగము పొందడమని, అంబతేజమును జ్ఞానాగ్ని వెలుగని, అంబ అనగ ఆత్మని, కర్మ కాలిపోయి మోక్షము పొందినవానిని గురుడని పై చరణములో తెలిపారు.


3. ఆరునదుల విూద అంబయున్నదన్న
అంబతో దుర్గాంబ ఆటలాడునన్నా
ఆట్లాటలో మంచి అర్థమున్నాదన్న
అర్థమెరిగినవాడు తాహరిగురుడన్నా ||ఈ జన్మ||

మన శరీరములో అతిపెద్దనాడి బ్రహ్మనాడి. దానినే సుసుమ్ననాడి అని కూడ అంటుంటారు. ఈ నాడిలో మొత్తము ఏడుకేంద్రములు గలవు. ఆరు కేంద్రములకు పైన ఏడవకేంద్రములో ఆత్మ నివాసము చేయుచున్నది. అందువలన మూడవ చరణములో క్రింది ఆరు నాడి కేంద్రములను ఆరు నదులుగ పోల్చి, పైన ఏడవ కేంద్రములోనున్న ఆత్మను అంబ అని, ఆరు నదుల మీద అంబ ఉందన్నారు. ఆత్మ పరమాత్మ స్వరూపమైన 'ఓం' అను పంచాక్షరితో శ్వాసను నడుపుచున్నది కావున శ్వాసనడుచుటను ఆట అని, శ్వాసలో ఇమిడియున్న 'ఓం'ను మంచి అర్థమని, ఓంకారమును తెలిసినవాడు ఆటలోని అర్థము తెలిసిన వాడని, పరమాత్మలోనికి ఐక్యమైనవానిని హరిగురుడని కూడ ఈ చరణములో చెప్పారు.