ఈ పుట ఆమోదించబడ్డది

కదా యముడు మనలను బాధించేది. బాధపడు కర్మలు యోగముచేత కాలిపోవుట వలన యముడు కూడ ఏమి చేయలేడు. అందువలన ఈ తత్త్వములో పంచాక్షరిమంత్రము పఠనచేయరన్న పఠనచేసిన యముడు పారిపోవునన్నా అని మొదటిచరణములో చెప్పారు. ఎపుడు కర్మలు లేకుండపోవునో అపుడు పరమాత్మ మోక్షమను పండును ఇచ్చును. మోక్షము పొందినవాడు పరమగురుడని చెప్పారు. మోక్షమును పండు అని వర్ణించినవారు పరమాత్మను అంబ అని వర్ణించారు. పరమాత్మ ఇచ్చునదే పరమపదము కావున అంబ ఫలమిచ్చునన్నారు.


2. మూడారు వాకిల్లు మూయవలెనన్న
ముక్తివాకిట నిలచి తలుపు తీయన్నా
తలుపు తీసిన అంబతేజమిచ్చన్న
తేజమందినవాడు తాగురుడోయన్నా ||ఈ జన్మ||

మన శరీరమునకు మొత్తము తొమ్మిది రంధ్రములు గలవు. వాటినే తొమ్మిది వాకిల్లు అన్నారు. శరీరము మీద ద్యాసలేకుండ చేయడమును తొమ్మిది వాకిల్లు మూసివేసినట్లాన్నారు. అజ్ఞానమునుండి జ్ఞానములో ప్రవేశించుటకు కనిపించని ఒక వాకిలి గలదు. దానినే ముక్తివాకిలి అన్నారు. ఒక మనిషి తన శరీరము విూద ద్యాసలేకుండ చేసుకొని తన జ్ఞానము ద్వార యోగములోనికి ప్రవేశించడమును పై తత్త్వములో మూడారు (మూడు ఆరు మొత్తము తొమ్మిది) వాకిల్లు మూయవలెనన్న ముక్తివాకిట నిలిచి తలుపుతీయన్నా అని అన్నారు. ఆ విధముగ శరీరము మీదూడ ద్యాసలేకుండ జ్ఞానము ద్వార ముక్తివాకిలి తెరచి బ్రహ్మయోగము లోనికి పోయిన వానికి ఆత్మ తెలియును. ఆత్మ తెలియడము ద్వార జ్ఞానశక్తి లభించును. ఆత్మ ద్వార ఆ జ్ఞానాగ్నిని కల్గినవాడు తనకున్న