ఈ పుట ఆమోదించబడ్డది

పంచాక్షరి అంటే ఐదు అక్షరములతో కూడుకొన్న మంత్రమని అందరు అనుకొంటారు. అందరు అనుకొను మంత్రము "ఓం నమః శివాయ". ఈ మంత్రములో ఐదు అక్షరములుకాక ఆరు అక్షరములు గలవు. కావున ఈ మంత్రము యొక్క అసలైన వివరమును తెలుసుకొందాము. అక్షరము అనగ నాశనముకానిదని అర్థము. క్షరము అనగ నాశనము అని అర్థము. ఐదు అనగ ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పంచభూతములని తెలుసుకోవలెను జ్ఞానము ప్రకారము ఐదు పంచ భూతములకు సర్వ జీవరాసులు నశించిపోవుచున్నవి. పంచభూతముల వలన జీవులు పుట్టుచున్నవి, అలాగే జీవరాసులన్ని పంచభూతములలోనే లయమైపోవుచున్నవి. పంచభూతములకు నాశనముకానిది ప్రపంచములో ఒకటే గలదు అదియే దేవుడు. దేవున్ని 'ఓం' అని ఒక గుర్తుగ మన పెద్దలు పెట్టారు. మిగత పంచభూతములకు కూడ అలాంటి గుర్తులనే ఉంచారు. ఆకాశమునకు 'న' అనియు, గాలికి 'మః' అనియు, అగ్నికి 'శి' అనియు, నీరుకు 'వా' అనియు, భూమికి 'య' అనియు గుర్తులు కల్పించారు. పంచభూతములకు కల్పించిన ఐదు గుర్తులను భీజాక్షరము లన్నారు. పంచభూతములకు భీజాక్షరములు వరుసగ 'నమః శివాయ అని ఉండగ పంచభూతములకు నాశనముకాని దేవునికి 'ఓం' అను భీజాక్షరముగలదు. దేవుడు పంచభూతములకు నశించడు కావున పంచఅక్షరి అని ఓం ను అన్నారు. పంచాక్షరి అనగ ఐదుకు నాశనము కానిదని అర్థము. పంచాక్షరి మంత్రములో ఐదు భూతములైన ప్రకృతి, వాటికి నాశనముకాని పరమాత్మను కలిపి చెపారు. దానినే "ఓం నమః శివాయ" అన్నారు. పంచాక్షరి మంత్రము యొక్క అర్థము తెలిసి దానినే ధ్యానించుచున్నవాడు ఎరుక కల్గియుండును. ఆ ధ్యానము చేత యోగము ఏర్పడును. యోగము వలన కర్మలు నశించుచుపోవును. కర్మలున్నపుడు