ఈ పుట ఆమోదించబడ్డది

విషయము ఎవరికి తెలియదు. ఊపిరితిత్తులను కదలించుశక్తి ఏదని తెలుసుకోవడమునే పై తత్త్వములో ఊదేతిత్తుల ఉన్నతి తెలియర ఓరన్నా అన్నారు. మన శరీరములో రెండు ఊదేతిత్తుల (ఊపిరితిత్తుల) మద్యలోను మరియు పైన రెండు కన్నుల మద్యలోను క్రింద గుదస్థానము మొదలుకొని పై శిరస్సు వరకు వెన్నుపూసల మద్యలో వెన్నుపాము అనబడు నరముగలదు. పై తత్త్వములో పాము అన్నట్లు వెన్నుపాము పేరుకు పామువలె పొడవుగ ఆకారమున్నప్పటికి అది మెదడు నుంచి క్రింది వరకు వ్యాపించిన ఒక పెద్దనరము. శరీరములో అతిపెద్ద నరము వెన్నుపాము ఒక్కటే. ఈ నరములోనే మనిషిలోని చైతన్యశక్తి ఇమిడియున్నది. దానిని కుండలీశక్తియని కొందరనుచున్నారు. వాస్తవానికి అది మన శరీరములోని ఆత్మశక్తియే. ఆత్మ అంటే ఏమిటి? దాని శక్తి అంటే ఏమిటి? అని కళ్లుమూసుకొని కళ్లమద్య స్థానములోనికి చూచితే అంత చీకటిమయముగ కనిపించును. ఆ విషయమునే పై తత్త్వములో తిత్తుల నడుమను చక్షుల విూదను చీకటికొట్టుర ఓరన్నా అని అన్నారు.


1) చీకటి కొట్టును తోక నాలుక తీసుక లేపర ఓరన్నా - తీసుక లేపిన కాకకు పాము చిఱ్ఱున లేచుర ఓరన్నా ||ఉ||

చీకటిమయముగ ఉన్న ఆత్మను పాముగ కూడ ఒక తత్త్వములో చెప్పుకొన్నాము మన ధ్యాసనంతటిని కన్నుల మద్యలో భ్రూమద్యమున కేంద్రీకరించిన అది యోగమగును. యోగము యొక్క తీవ్రతకు ఆత్మ తెలియుటకు మొదలిడును. ధ్యాసనంతటిని భ్రూమద్యన కేంద్రీ కరించడమును తోక నాలుక తీసుక అన్నారు. తోక చివరిది నాలుక అనగ మొదటిది చిన్న ఆలోచనను, పెద్ద ఆలోచను అన్నిటిని లేకుండ చేసకోవడమును, లేక చివరి ఆలోచనను మొదటి ఆలోచనను లేకుండ