ఈ పుట ఆమోదించబడ్డది

కావున కాయమను పుట్టలోన అన్నారు. పాముకు బుసకొట్టు స్వభావము ఉన్నట్లు ఆత్మకు కూడ శ్వాస ద్వార సోహం అను బుసకొట్టు స్వభావము ఉన్నది. మాయం అయిపోయిందని అంటే కనిపించకుండ పోయిందని అర్థము. మాయగా అంటే ఇక్కడ కనిపించకుండ అని అర్థము. శరీరములో ఆత్మ కనిపించకుండ ఉన్నది. కావున పాము మాయగానే మెలగుచుండు అని పై వాక్యములో అన్నారు, శరీరములో ఆత్మ కనిపించకుండ నివాసము చేయుచున్నదను వివరము మొదటి వాక్యములో గలదు.


 2) జంట నాగ స్వరములూది చందమామ, పామును పాదు పెకలింపవలెను చందమామ ||చం||

శరీరములో గల ఆత్మను పాముగ పోల్చుకొన్నపుడు ఆ పామును పట్టే దానికి కూడ ఉపాయముగలదు. సహజముగ పాములవారు నాగస్వరమును ఊది చుట్టచేసుకొని పాదుగపడుకొన్న పామును లేపి పట్టుకొనుచున్నాడు. అలాగే శరీరములోని పామును పట్టుటకు రెండు ముక్కురంధ్రములలో ఆడుచున్న శ్వాసను నాగస్వరముగ ఉపయోగించు కోవలసియున్నది. ముక్కు రంధ్రములలో ఆడుచున్న శ్వాసవిూద ద్యాసను పెట్టకోవడము వలన ఇతర విషయముల మీదికి మనస్సు పోకుండ నిలచిపోవును. అలా మనస్సును శ్వాసద్వార ఒక స్థాయికి తెచ్చుకొన్న తర్వాత శూణ్యస్థాయికి చేర్చి ఆత్మ మీదికి సులభముగ మల్లించుటకు వీలుకల్గును. ఈ విధముగ శ్వాస ద్వార ఆత్మను తెలియవచ్చునన్న ఉద్దేశముతో జంట నాగస్వరము ఊది పామును పాదు పెకలించవలెను అని అన్నారు.


3) తొమ్మిది వాకిల్లు మూసి చందమామ, పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ ||చం||