ఈ పుట ఆమోదించబడ్డది

విూద స్వాతికొంగ వేటలాడుచురాగ అని చెప్పబడినది. ఒక దాని తర్వాత ఒకటి తమ చైతన్యములను కోల్పోయినను, ఆఖరున గల ఏడవకేంద్రము మనస్సు వలన తన శక్తిని కోల్పోక నిలచిన దానివలన అన్నిటియొక్క చైతన్యములను నిలిపి వేసిన మనస్సు ఏడవ కేంద్రము వద్దకు వచ్చి తనశక్తి చాలక నిలిచిపోయిన దానివలన చాటునున్న చేపపిల్ల కొంగను మ్రింగెను అని చెప్పడమైనది.

-***-


---------------3. తత్త్వము--------------


చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరె చందమామ


1) కాయమను పుట్టలోను చందమామ, పాము మాయగానే మెలగుచుండు చందమామ ||చం||

2) జంట నాగ స్వరములూది చందమామ, పామును పాదు పెకలింపవలెను చందమామ ||చం||

3) తొమ్మిది వాకిల్లు మూసి చందమామ, పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ ||చం||

4) భక్తియను కట్టుకట్టి చందమామ, పామును యుక్తిచేసి పట్టవలెను చందమామ ||చం||

5) దేహ దేహములందు చందమామ, పాము తెలియకుండ చుట్టుకొన్నది చందమామ ||చం||

6) అజప మంత్ర ద్యానము చేత చందమామ, పాము అఖండ కళలతో వెలుగుచునుండు చందమామ ||చం||

7) పామును బట్టే యోగి ఎవరు చందమామ, ఓహో అతని పేరు సిద్దగురుడు చందమామ ||చం||