ఈ పుట ఆమోదించబడ్డది

అందువలన ఏడవ కేంద్రమందున్న చైతన్యమునే మూడవస్థలందు సాక్షిగ ఉన్నదని చెప్పవచ్చును. కుంభకము ద్వారా నిలిచిన మనస్సు బ్రహ్మనాడి యందు ఏడవ కేంద్రము చేరి అందు ఇమిడి పోవుచున్నది. మనస్సుతో పాటు అంతఃకరణములైన జీవుడు కూడ ఏడవ కేంద్రములో ఉన్న ఆత్మయందేలీనమై పోవుచున్నాడు. జీవుడు ఆత్మయందు లీనము కావడమునే "యోగము" అంటున్నారు.


కుంభకమునే పూర్వము యోగి అయిన శ్రీ వీరబ్రహ్మంగారు ఒక తత్త్వముగా చెప్పియున్నారు. కుండలీశక్తిని వేరుగా పోల్చుకొన్న వారు, కుండలీశక్తి నిదురపోతున్నదన్న వారు ఉండుటవలన ఆ తత్త్వమునకు అర్థమే తెలియకపోయి, ఆఖరుకు భిక్షగాళ్లు పాడుకొనుటకు ఉపయోగపడుచున్నది. గుడ్డివానికి రత్నము ఇచ్చిన వ్యర్థమైనట్లు శ్రీ వీరబ్రహ్మముగారు ఎంతో జ్ఞానమును ఉపయోగించి చెప్పిన మాటను తెలియని మనము వ్యర్థము చేయుచున్నాము. కుండలీనే పెద్దగ పెట్టుకొన్న వారు మరియు విన్నవారు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు చెప్పిన క్రింది తత్త్వమును గ్రహించవలయునని తెలుపుచున్నాము. గొప్ప మంత్రము బ్రహ్మముగారు చెప్పినది. ఆ మంత్రము మనశ్వాసయే. శ్వాసలోపలికి ప్రవేశించినపుడు "సో" అను శబ్దముతో, బయటికి వచ్చునపుడు "హం" అను శబ్దముతో చలించుచున్నది. ఈ రెండు శబ్దములు కలసి "సోహం" అను శబ్దము ఏర్పడినది. ఈ శబ్దము మహిమకలది కావున దీనిని మంత్రము అని చెప్పాడు. మరియు అక్షర సమ్మేళనములతో కూడుకొన్నది. కావున మంత్రము అని చెప్పబడినది. "సోహం" అనుమంత్రము ఆదిమంత్రముగా మారుచున్నది. అది ఏ విధముగననగా! "సో" అను శబ్దమునందు చివరిగా "ఓ" అను