ఈ పుట ఆమోదించబడ్డది

కంటికి కనిపించక బ్రహ్మనాడి పై భాగమునుండి చివరి భాగమువరకు వ్యాపించియున్నది. చిన్న చిన్న నరములు అనేకము శరీర వివిధ భాగముల నుండి వచ్చి బ్రహ్మనాడితో కలిసియున్నవి. ఈ చిన్న నరముల ద్వారానే శరీరమందు ఏ విషయమైన బ్రహ్మనాడిని చేరి అక్కడినుండి కపాల స్థానములో నివాసమున్న జీవునకు చేరుచున్నది. ఇంతేకాక బ్రహ్మనాడికి ముందర భాగములో ఇరువైపుల సూర్య చంద్రనాడులనునవి కలవు. ఈ నాడులు రెండు ముఖ్యముగ ఊపిరితిత్తులతో సంబంధము ఉన్నవి. మన ముక్కురంధ్రముల ద్వార ఆడుశ్వాస సూర్యచంద్రనాడుల ద్వారానే కదలింపబడుచున్నది.


పై విధముగ శరీర అంతర్భాగమున్నది. ఈ విషయమును యోగులైనవారు పద్యరూపములో చెప్పారు. లోపలి భాగము కనిపించనిది. కావున కానని భూమిలోనన్నారు. శరీరము ఆత్మ నిలయమైన పవిత్ర స్థానము కావున పరిమళముగల కస్తూరికోన అన్నారు. శరీర పై భాగమున ఆత్మ, జీవుడు,గుణములు, కర్మలకు నిలయము కావున శరీరమును పర్వతముగ పోల్చి మందరగిరి అన్నారు. కపాలస్థానము నుండి బ్రహ్మనాడి పుట్టినది కావున దానిని మర్రిచెట్టుగ చెప్పారు. బ్రహ్మనాడి నుండి ఎన్నో నాడులు చీలిపోయాయి. కనుక నాడులన్నిటిని కొమ్మలుగ పోల్చి చెట్టుకు చెర్చింప పదినూర్ల కొమ్మలన్నారు. బ్రహ్మనాడితో సంబంధమున్న నరముల ద్వార లెక్కకురాని అనేక విషయములు బ్రహ్మనాడిని చేరు చున్నవి. కావున కొమ్మకొమ్మకు కోటి కోతులుండు అన్నారు. చిన్న నరములన్నిటికి బ్రహ్మనాడియే ఆధారము. బ్రహ్మనాడినుండియే శక్తి అన్ని నరములకు ప్రవహించుచున్నది. అందువలన బ్రహ్మనాడిని నగధరం బైౖన నడిమికొమ్మ అన్నారు. బ్రహ్మనాడియందే అన్నిటికి సాక్షియైన ఆత్మ నివాసమున్నది. కావున ఆత్మను నక్కగ పోల్చి నడిమి కొమ్మ మీద