ఈ పుట ఆమోదించబడ్డది

---------------1. తత్త్వము--------------


సీ..

కానని భూమిలో కస్తూరి కోనలో
మందరగిరి విూద మర్రి చెట్టు
చెట్టుకు కొమ్మలు చెర్చింప పది నూర్లు
కొమ్మ కొమ్మకు కోటి కోతులుండు
నగదరం బైనట్టి నడికొమ్మ విూదను
నక్క యొకటుండు చుక్కవలెను
సుస్థిరం బైనట్టి చుక్కకు తూర్పున
సూర్య చంద్రాదులు తేజరిల్లు


తే..

దీనికర్థంబు చెప్పు దేశికునకు
నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పుతోడ
చెప్పగలిగనేని నేనిత్తు చిన్న మాడ
చెప్పలేకుంటె నేనగుదు చిన్న నగువు.


భావము :- దైవము నిల్వయున్న నిజమైన దేవాలయమైన మన శరీరములో, కంటికి కనిపించని చూడబడని అంతర్గతములో, ఎముకలచే మరియు వెన్నుపూసలచే పేర్చబడిన శరీర భాగములో ఎతైన కపాలస్థాన మందు జీవుల సారాంశమంతయు ఇమిడి ఉన్నది. ఆ స్థానములోనే జీవరాసుల జరిగిన, జరుగుచున్న, జరుగబోవు చరిత్రలన్ని దాచబడినవి. శిరో భాగములో మద్యనగల గుణచక్రమందు గుణములు, కర్మచక్రమందు కర్మ, కాలచక్రమందు కాలము కనిపించక సూక్ష్మముగ ఉన్నవి.


కనిపించు మెదడునుండి ఒకనాడి బయలుదేరి గుదస్థానము వరకు వ్యాపించివున్నది. దీనినే బ్రహ్మనాడి అందురు. ఈ నాడియందు కాల, కర్మ, గుణచక్రములను నడుపు ఆత్మ నివాసమై ఉన్నది. ఆత్మ