పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/174

ఈ పుటను అచ్చుదిద్దలేదు

-N હ98) హర్షధ్వానాలలో ఆమోదించారు. రామమూర్తి పంతులుగారు దిగ్విజయము సాధించినంత సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ విజయం వ్యావహారిక భాషావాదులందరిదీ అంటూ గుల)జాడ ఉంటే సంతోషంపట్టలేక గంతులు వేసేవాడు" అన్నారు. శ్రీపాదవారు తణుకు సభనుంచి తిరిగిరాగానే గ్రామ్య భాషను చీల్చిచెండాడడానికి 'వజ్రాయుధము' అనే పత్రిక చేపట్టారు. ఈ సమావేశాలపై, శ్రీ జి.వి.రామమూర్తి (గిడుగు సీతాపతిగారి తనయుడు) తన 'కళాప్రపూర్డులు అనే గ్రంథంలో విస్తారంగా వివరించారు. ఈ సభల్లో ෂීධි-කේ, చెళ్ళపిళ్ళ లాంటి గ్రాంథికవాదులు పాల్గొన్నారు. ඩීට් రచనలలో పూర్వలక్షణాలకు విరుద్ధంగా ఉండే తప్పలను ఎత్తి రామమూర్తిగారు ప్రధానంగా విమర్శించారు. ఆ తప్పలు నేటి లక్షణాలను బట్టి తప్పలుకావని వారే సమర్ధించి, ఎంతటి మహాకవి అయినా వ్యావహారిక భాషాప్రభావానికి లోనుకాక తప్పదని నిరూపించారు. ముఖ్యంగా శ్రీపాద వారి రచనలలోని ప్రయోగాలను ఎత్తిచూపించి వారి ఎదుటే వారిని విమర్శించారు. అంతమంది సభికుల ఎదుట రామమూర్తిపంతులుగారు విద్యార్థుల వ్యాసరచనలలోని తప్పలు పట్టి దిద్దినట్లుగా విమర్శించడంతో శ్రీపాద వారికి ఆగ్రహం కలిగింది. వ్యావహారిక భాషను చీల్చిచెండాడడానికి శ్రీపాద 'వజ్రాయుధాన్నిచేపట్టారు. ఈ కార్యక్రమాల ఫలితంగా ఒకప్పడు వ్యావహారిక భాషా వాదాన్ని ఎదిరించిన శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు రామమూర్తిగారి శిష్యవర్గంలో చేరిపోయారు. రామమూర్తిగారి కృషికి రూపకల్పన చేయ్యాలని వీరు 'ఆంధ్రభాషానుశాసనము అనే వ్యావహారిక భాషా వ్యాకరణాన్ని రచించారు. /7 చారిత్రాత్మక తణుకు సమావేశాలద్వారా గిడుగు వారు గ్రాంథిక భాషపై సమరశంఖం పూరించారు. వ్యవహారిక భాషను చేపట్టడం, అందులో రచనలు చేయడం గిడుగువారు ఒక రాజమార్గంగా చూపారు. గిడుగు వారు పుట్టింది, పెరిగింది, గిట్టింది తణుకులో కానప్పటికీ తణుకు సమావేశాల ద్వారానే వారు వ్యవహారికభాషోద్యమానికి నాంది పలికారు. గిడుగువారి భాషా సంస్కరణ వాదానికి తణుకు సమావేశాలు సాక్ష్యంగా నిలుస్తాయి. ఆంధ్ర సాహిత్య పరిషత్తువారి సమావేశాలు తణుకులో దిగ్విజయం అవడంవల్ల గిడుగువారి వ్యవహారికభాషా ఉద్యమానికి నాంది పలికి తణుకు చరిత్రపుటలకెక్కింది. ఎందరో తణుకులో తళుకుమనగా, గిడుగువారు మాత్రం తణుకునే తళుక్కుమనిపించారు. ఈ విధంగా తణుకును సాహిత్యచరిత్రలో స్వర్ణలిఖితం చేసారు. తణుకు చరిత్రలో ఆంధ్రసాహిత్య పరిషత్వారి ఈ సమావేశాలు మరుపురాని, మరువలేని ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతాయి. সুঃ পুঃ পুঃ – للمســـــــــــــ -ܓܠܠ بر