ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రింపులతో, త్వరగా పూర్తి చేయుమని ఒత్తిడి చేయుచుండెడివారు. వారికి ఈ గ్రంథము మీద ఎంతమక్కువ యనిన, 1943-44 సంవత్సరములు, యుద్ధ సమయము, ఆరోజులలో తను కష్టా ర్జితధనము సుమారు వెయ్యి రూప్యములు ఎప్పుడు సిద్ధముగానుంచుకొని, తగిన కాగితము దొరికిన వెంటనే అచ్చువేయు సంకల్పముతో, తత్సంపాదనకై ప్రయత్నములు చేసి చేసి, తుదకు మండలాధికారి సాహాయ్యము వడసియు కంట్రోలు దినములలో కాగితమును సంపాదించలేక విఫలురైరి. ఆపుస్తకము అచ్చుపడక ఆనాటినుండి ఇప్పటివరకు అటులనే యుండిపోయినది.

ఈ విషయమును గుర్తెఱిగినవాడను కాబట్టి, ఈ గ్రంథము బహుళ ప్రజకు ఉపయోగించునో లేదో తెలియదుకాని శ్రీ దాసాభిమతానుసారము, ప్రప్రథమముగా అచ్చు వేయించ వలెనని సంకల్పించి, నాకోరిక ఆచార్య యన్. వి జోగారావుగారికి విన్నవించుకొంటిని. కాని వారు నన్ను ఆ ఉద్యమమున నిరుత్సాహ పరిచి ప్రప్రథమముగా శ్రీ నారాయణదాస రచన "మేలుబంతి" అను గ్రంథము అచ్చువేసిన, సాహిత్యలోకమునకు ఉపయోగముగ నుండును. తదుపరి ఈ గ్రంథ ముద్రణ చేయ వచ్చునని సలహాయిచ్చి ముందు నాచే, దాసరచనలు మేలుబంతి, కచ్చపీశ్రుతులు, వ్యాసపీఠము - మూడు అచ్చు వేయించిరి.

ఒకనాడు నేను నామిత్రులు జోగారావుగారు దాస భారతీ ప్రచురణల ప్రణాళిక వేయు సమయములో మాకిద్దరకు చక్కని ఊహారేఖ పొడమి, ఇటువంటి గ్రంథ ముద్రణకు సాయము చేయువ్యక్తి ఎవరా అని ఆలోచించగా వెంటనే మాకు వదాన్య శేఖరులు, సాహితీప్రియం భావుకులు ! ఆధ్యాత్మిక విద్యయందుమిక్కిలి ఆసక్తిగలవారు. రసజ్ఞ శేఖరులు శ్రీ పోలిశెట్టి సీతారామాంజనేయులుగారు మనస్సులో మెదలిరి. ఆ మరునాడే మేమిద్దరము వారిని దర్శించి మా ఉద్యమమును విన్న వించుకొనగా. అంతయువిని, వెంటనే అచ్చువేయించుటకు తమ ఆమోదము తెలిపి. ఈ పుస్తక ముద్రణకు అగుకర్చు ఎంత అగునో తెలుపుమనిరి. తరువాత కొలది