పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/685

ఈ పుటను అచ్చుదిద్దలేదు

683 పేని మమ్ముఁ దన కుక్షిఁబెట్టి పెంచఁగాను రేకు:0085-04 మాళవి సంపుటము: 01-414 పల్లవి:నిత్యులు ముక్తులు నిర్మలచిత్తులు నిగమాంతవిదులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రదుకరో సాటికిఁ బెనఁగక జడులాల చ. సకలోపాయశూన్యులు సమ్యగ్జానపూరులు అకలంకులు శంఖచక్రలాంఛను లన్నిట బూజ్యులు వైష్ణవులు వొకటీ గోరరు వొరుల గొలువరు వొల్లరు బ్రహ్మదిపట్టములు అకటా వీరలసరియనఁ బాపం బారుమతంబులపూఁతకోకల చ. మంత్రాంతరసాధనాంతరంబులు మానినపుణ్యులు విరక్తులు యంత్రపుమాయలఁ బొరలుపరులకు యెంతైనా మొక్కరు వైష్ణవులు తంత్రపుకామక్రోధవిదూరులు తమనిజధర్మము వదలరు జంత్రపుసంసారులతో వీరల సరియని యెంచఁగఁ బాపమయ్య చ. తప్పరు తమపట్టినవ్రత మెప్పుడు దైవ మొక్కడేఁ గతియనుచు వొప్పగుతమపాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు కప్పిన శ్రీవేంకటపతిదాసులు కర్మవిదూరులు సాత్వికులు చెప్పకుఁడితరుల సరిగా వీరికి సేవించఁగ నే ధన్యుఁడనైతి రేకు: 9058-02 మలహరి సంపుటము: 04-570 పల్లవి: నిద్దిరించీఁ బాలజలనిధివలెనే ఒద్దిక శ్రీ రమణునికి నొత్తరే పాదములు చ. వేఁగుదాఁక జిత్తగించి విద్దెలెల్లనాదరించి బాగుగాఁ గృపారసము పంచి పంచి యేగతిఁ బవళించెనో యెట్ల భోగించెనో యోగీంద్రవరదుని నూ(చరే వుయ్యాలను చ. వాలుగన్నుల రెప్పల వడదాఁకి తను తావి చాలుకొన నూర్పుకలు చల్లి చల్లి నీలవర్ణపుగుణము నెరపుచు నొకయింత కాలము కన్నుల దిప్పీఁ గప్పరే దోమతెర చ. సరగున యోగనిద్ర చాలించి లోకమెల్ల కరుణించఁ దలఁచి వేంకటగిరిపై అరుదుగ సకలలోకారాధ్యుఁడాయె మించి విరివి నాలవట్టాలు విసరరే సతులు పె.అ.రేకు:0058-04 దేసాక్షి సంపుటము: 15-331 పల్లవి: నినుఁ గొలువనిదెల్లా నీ భాగ్యము సనకాదు లెఱిఁగిరి సర్వమైన పుణ్యము చ. వలెనని పేరుకొంటే వాకున సులభుండవు తలఁచితే మది కెంతే సులభుండవు చెలఁగి పూజించితేను చేతికి సులభుండవు వలసితేఁ జేకొనేటి వారి వారి పుణ్యము చ. లాచి వింటేఁ జాలు వీనులకు సులభుండవు చూచితేఁ గన్నుల కెంతే సులభుండవు యేచి మొక్కితే మేనికి నెంతైనా సులభుండవు కాచి యుండి సేవించేటి ఘనులదే పుణ్యము చ. నమ్మి శరణంటే యీ జన్మమున సులభుండవు కిమ్ములఁ గోరితే దేహికి సులభుండవు ఇమ్ముల శ్రీవేంకటేశ యిన్నియునుఁ దా మెఱిఁగి పమ్మిన కృపఁ జేరిన భక్తులదే పుణ్యము