పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/669

ఈ పుటను అచ్చుదిద్దలేదు

667 పె.అ.రేకు:0021-03 నాట సంపుటము: 15-119 పల్లవి: నానామహిమల శ్రీ నారసింహము పూని మమ్ము రక్షించీ పొగడెద నిదిగో చ. కొండవంటి వేదాద్రిగుహలలో సింహము దండి భవనాశి యేటిదరి సింహము అండ నారుశాస్త్రముల అడవిలో సింహము నిండి అహోబలముపై నిక్కిచూచీ నదిగో చ. దిట్టయోగీంద్రుల మతితెర మఱఁగు సింహము జట్టిగొన్న శ్రీసతితో జంటసింహము పట్టి దైత్యుల వేఁటాడే బలుదీము సింహము మెట్టి అహోబలముపై మెఱసీఁదా నదిగో చ. పలుదేవతల వెనుబలమైన సింహము కెలసి కంబానఁ చెనఁగిన సింహము అలరి శ్రీ వేంకటేశుఁడైనట్టి సింహము కొలువై అహోబలాన గురుతాయ నిదిగో రేకు:0131-05 బౌళి సంపుటము: 02-125 పల్లవి: నానావర్గముల నాఁటుకొను నొకయోగి మానిమీఁది తపసి సామన్యుఁడాయోగి చ. పున్నమనమాసఁ గూడఁ బొదిగీ నొక్కొకయోగి కన్నులచూపులు సరిగాఁ దూఁచు నొకయోగి మిన్నునూయి చేఁతాటఁ జేఁది మెచ్చు మింగు నొకయోగి వెన్న సన్నముగ నూరి వీఁగు నొకయోగి చ. గాలి ముడియగఁ గట్టి కలుగుడిగట్టు GEOP(B) నాలిమింటివిత్తు వెట్టి నగు నొకయోగి మూలనిధానము గని ముందు గానఁ డొకయేూగి నేల దలకిందు సేసి నిక్కు నొకయోగి చ. గతజలములకెల్లఁ గట్టగట్టు నొకయోగి తతిఁ బూవులమూటల దడిగట్టు G3ত০6) యితవైన శ్రీవేంకటేశుని మఱఁగు చొచ్చి గతిగనే నాతఁ డొక్కడే యోగి రేకు:0310–01 మాళవిగౌళ సంపుటము: 04-055 పల్లవి: నానావర్ణముల నడగొండవలెను దానవారి తేరదె తగ తిరువీధుల చ. కదలె కదలె నదె గరుడధ్వజునితేరు అదె మిన్నుమోచిన నీలాద్రివలెను యెదిరె నెదిరె నదె యిందిరాధిపుని తేరు కదిసి చుక్కలు మోచే కనకాద్రివలెను చ. తిరిగె తిరిగె నదె దేవుదేవునితేరు అరుదైన ఘనమందరాద్రివలెను పరువులిడీ నదె పట్టపు శ్రీపతితేరు విరిఁవి గైలాసపు వెండికొండవలెను చ. దగ్గరె దగ్గరె నదె దైవశిఖామణితేరు అగ్గలపు శ్రీవేంకటాద్రివలెను అగ్గమై శ్రీవేంకటేశుఁడలమేలుమంగఁ గూడె తగులేని మొత్తపు దొంతరకొండవలెను