పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/515

ఈ పుటను అచ్చుదిద్దలేదు

513 చ. దొంగిలి మాగుట్టులెల్లా దోవ వేసి మరుబారి భంగ పెట్టితిరిగా వోభామలార చెంగలించి వేంకటేశు సేవకుఁ జొచ్చితిమి యెంగిలి మోవులును మీ రేడఁబడే రిఁకను రేకు: 0030-02 పాడి సంపుటము: 01-183 పల్లవి: చక్రమా హరి చక్రమా వక్రమైన దనుజుల వక్కలించవో చ. చుట్టి చుట్టి పాతాళముచొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన వోచక్రమా పట్టిన శ్రీహరి చేతఁ బాయక యీజగములు వొట్టుకొని కావగదవో వో చక్రమా చ. పానుకొని దనుజుల బలుకిరీటమణుల సానలఁ దీరిన వోచక్రమా నానాజీవముల ప్రాణములుగాచి ధర్మమూని నిలుపఁగదవో వోచక్రమూ చ. వెఱచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ వుఱుటు గొనియాడేరో చక్రమా అఱిముఱిఁ దిరు వేంకటాద్రీశు వీధుల వొఱవుల మెఱయుదువో వో చక్రమా పె.అ.రేకు:0042-03 వరాళి సంపుటము: 15-239 పల్లవి: చతురుఁడ వన్నిటాను జనార్ధనా మమ్ము సతముగా నేలితివి జనార్ధనా చ. సమమోహాలు మనవి జనార్ధనా యిట్టె జమళి నున్నార మిదె జనార్ధనా సమకూడెఁగా లెస్స జనార్ధనా నీ సముక మెవ్వరి కబ్బు జనార్దనా చ. చవులాయె సరసాలు జనార్దనా పెండ్లి చవికెలో మనకు జనార్ధనా సవరని వాఁడవు జనార్దనా ඍටිව් సవతు లేరు నీకు జనార్ధనా చ. సంకె దీరఁ గూడితివి జనార్ధనా నీకు చంక లెత్తి మొక్కేము జనార్ధనా జంకించకు శ్రీవేంకట జనార్ధనా శంకుఁజక్రములచేతి జనార్ధనా రేకు: 0321-04 బౌళి సంపుటము: 04–121 పల్లవి: చదివి చదివి వట్టిజాలిఁబడు టింతేకాక యెదుట నిన్ను గానఁగ నితరులవశమా చ. ఆకాశముపొడవు ఆకాశమే యెరుఁగు ఆకడ జలధిలేఁతు ఆ జలధే యెరుఁగు శ్రీకాంతుఁడ నీ ఘనము చేరి నీవే యెరుఁగుదునీకడ నింతంతన నితరుల వశమా చ. నదులయిసుకలెల్ల నదులే యెరుఁగును కదలి గాలియిరవు గాలికే తెలుసు అదన నాత్మగుణము లంతరాత్మ నీవెరుగుదిదియదియనిచెప్ప నితరులవశమా