పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/368

ఈ పుటను అచ్చుదిద్దలేదు

366 వొక్కరివాఁడఁ గాకుందు వుస్సురనుకొంటాను చ. విరతిఁ బొందుదుఁ గొంత వేరే సంసారముఁ జేతు యొరవులవాఁడనే యెప్పుడు నేను అరిది శ్రీవేంకటేశుఁ డంతలో నన్ను నేలఁగా దొరనైతి నధముఁడఁ దొల్లే నేను రేకు:0267-03 మాళవి సంపుటము: 03–385 పల్లవి: ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య గాఁటపుహరి యొక్కఁడే గతి మా కిఁకనయ్య చ. మరుగుచు శ్రీహరి మాయలోఁ జిక్కినయట్టు గరిమలఁ గులకాంతకాఁగిటఁ జిక్కితిమయ్య తిరముగఁ గాలములు దిగమింగినయట్టు సారిది చవులు మింగుచు నున్నారమయ్య చ. జననిగర్భములోన చక్కఁగా మునిఁగినట్టు మునుకొని నిదురల మునిఁగి వున్నారమయ్య చనవునఁ గర్మమనే జలధిలో నున్నట్టు ధనధాన్యాల నడుమఁ దగిలి వున్నారమయ్య చ. పేదవాఁడు నిధిగని పెక్కువ బతికినట్టు గాదిలి శ్రీవేంకటేశుఁ గని చెలఁగితిమయ్య యీదెస మొక్కే దైవ మెదురుగా వచ్చినట్టు ఆ దేవుఁడే మాకు నంతరాత్ముఁ డాయనయ్య రేకు: 0340-06 శంకరాభరణం సంపుటము: 04-237 పల్లవి: ఏఁటి బిడ్డం గంటివమ్మ యొశోదమ్మ గాఁటపు దేవతలెల్లఁ గాచుకున్నా రితని చ. చెక్కుమీఁటి పాలువోయి చేరి నోరు దెరచితే పక్కుననుఁ బొడచూపె బ్రహ్మాండాలు అక్కున నలముకొంటే నంగజతాపము మోఁచె మక్కువకు వెరతుము మాయపు బాలునికి చ. పొత్తులలో నుండఁగానె భుజాలు నాలుగుదోఁచె యిత్తల బాలునికేవి యిటువంటివి యెత్తుకొన్న వేకమై యెవ్వరికి వసగాఁడు హత్తిచూడ వెరతు మీ యూరడిబాలునికి చ. తేటి వీనితోడిముద్దు దేవలోకము పనులు మీఱి యేవి చూచినాను మితిలేనివి ఆఱడిగొల్లెతలము అట్టె కూడి యాడితిమి వేఱు సేయ వెరతు శ్రీవేంకటాద్రిబాలుని రేకు: 0067-03 శ్రీరాగం సంపుటము: 01-348 పల్లవి: ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్క మాటలోనే యటమటమైన బ్రదుకు చ. సంతకూటములే చవులయిన బ్రతుకు దొంతిభయములతోడి బ్రదుకు ముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకు వంతఁ బొరలి కడవరంలేని బ్రదుకు చ. మనసుచంచలమే మనువయిన బ్రదుకు దినదినగండాలఁ వీరు బ్రదుకు తనియ కాసలనె తగిలేటి బ్రదుకు