పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/317

ఈ పుటను అచ్చుదిద్దలేదు

315 దింపఁగరాని మోపులు సుమ్మీ తీపులు రేఁచీ సంపద లెల్లా రంపపుటాన దీనికిఁ దోడు రాతిరిఁ బగలు పెట్టని తరవు యింపున గోవిందా యని నొడుగు యితఁడే దయరక్షించును మనసా చ. కావలెనని తాఁ గోరినయపుడే కప్పును మాయ తోయఁగ రాదు కేవలమైన వుపమలచేత గెలువఁగరాదు తెలియని చిక్కు ఆవల నేమీఁ దడవఁగ నేలా యఖిలంబునకు నేలికెంమైనా శ్రీవేంకటేశుపాదము లెపుడూ సేవింపుచును చెలఁగవో మనసా రేకు:0017-06 లలిత సంపుటము: 01-106 పల్లవి: ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ జిక్కి జీవుఁడు మోక్షసిరిఁ జెందలేఁడు చ. ఒడలు మంసపూర మొక పూఁటయిన మీఁదు గడుగకున్నఁ గొరగాదు కడలేనిమలమూత్రగర్పిత మిది, లోను గడుగరాదు యెంతగడిగినఁ బోదు చ. అలర చిత్తము చూడ నతిచంచలము దీనఁ గలసిన పెనుగాలి గనము మెలుపులేనిచిచ్చు మీఁదమిక్కిలిఁ గొంత నిలుపు లేదు పట్టి నిలుపఁగరాదు చ. తిరువేంకటాచలాధిపుఁడు నిత్యానంద కరుఁడు జీవునకు రక్షకుఁడు కరుణించి యొకవేళఁ గాచినఁగాని మేనుచొరకమానెడుబుద్ది చోఁక దెవ్వరికి రేకు:0202-06 సాళంగనాట సంపుటము: 03-012 పల్లవి: ఎక్కడి నరకములు యొక్కడి మృత్యువు మాకు దక్కి నీ దివ్యనామామృతము చూరగొంటిమి చ. తమితో శ్రీపతి నీ దాసులఁ జేరినప్పుడే యమకింకర భయము లణఁగిపాశీయ జమళి నీ యాయుధ లాంఛనము మోచినప్పుడే అమరఁ గాలదండము లవియెల్లఁ బొలిసె చ. మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే ఘనయామ్య మార్గము గట్టు వడియ వొనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే కనలు కాలసూత్రాది ఘూతలెల్లఁ బూడె చ. యెడరై నీ మంత్రజప మెంచుకొన్నయపుడే కడుఁ జిత్రగుప్నని లెక్కలు గడచె వడిగా శ్రీవేంకటేశ్వర మీ శరణనఁగా అడరి వైకుంఠము మాయరచేత నిలిచె రేకు:0280-02 లలిత సంపుటము: 03-460 పల్లవి: ఎక్కడి పుట్టుగ లిఁక నెక్కడి మరణములు మిక్కిలి నీ ముద్రలు నా మేననున్న వివిగో చ. కెరల పాపములకుఁ గెరల కర్మములకు హరి నీ నామము నోరనంటితేఁ జాలు నరకములేమి సేసు నా నేరమేమిసేసు నిరతి నా మతిలోన నీ వుండఁగాను చ. చిక్క నింద్రియములకు చిక్కను బంధములకు చొక్కి హరి నీ మఱఁగు చొచ్చితిఁ జాలు