పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/311

ఈ పుటను అచ్చుదిద్దలేదు

309 విచ్చనవిడిఁ జెలఁగు విజయనారసింహా చ. జలధు లేడును నీకు జలకపు మడుగులు అలరి భూమెల్లా విహారదేశము కెలన రేలుఁబగళు కిందిమీఁది రెప్పలు వెలయఁగ విహరించు విజయనారసింహా చ. చక్కటి శ్రీమహాదేవి జంటైన ఆడుసింహము నిక్కపు దేవతలెల్లా నీ పిల్లలు యొక్కవై శ్రీవేంకటాద్రి నిన్నిటా భోగించేవు వెక్కసమై మమ్మేలుకో విజయనారసింహా రేకు:0014-01 ముఖారి సంపుటము: 01-083 పల్లవి: ఎందుఁ బొడమితిమో యొఱఁగము మా కందువ శ్రీహరికరుణేకాక చ. ఏఁటిజన్మమో యొఱఁగము పర మేఁటిదో నే మెఱఁగము గాఁటపుకమలజుఁ గాఁచినయూ నాఁటకుఁడే మానమ్మినవిభుఁడు చ. యెవ్వారు వేల్పులో యెఱఁగము సుర లెవ్వరో నే మొఱఁగము రవ్వగు శ్రీసతిరమణుఁడు మాకవ్వనజోదరుఁ డంతరియామి చ. యింకానేఁటిదో యెఱఁగము యీ - యుOకెలబాముల నలయము జంకెల దనుజులఁ జదిపినతిరువేంకటేశుఁడు మావిడువనివిభుఁడు రేకు:0188-05 మాళవి గౌళ సంపుటము: 02-448 పల్లవి: ఎందుకు విచ్చేయనేల ఇన్నియు నాలోనివే అంది యివే చేకొనవే ఆరడి నీకేల చ. కాముకుఁడవై గోపికలఁ బొందఁ బ్రియమైతే కాముకత్వము నాయందుఁ గలదెంతైనా గోమున కంసాదులపై క్రోధమే ప్రియమైతే నాముల క్రోధ మిదివో నాలో నున్నది చ. లోకుల చీరలీకుండే లోభమే ప్రియమైతే యీకడ లోభము నాలో హెచ్చినదిదే మాకులు మద్దులు దొబ్బేమదమే ప్రియమైతే చేకొను మదము నాలో సేనాసేన చ. మఱి శిశుపాలునిపై మచ్చరమే ప్రియమైతే మెఱయు మత్సర మిదే మించీ నాలో తటి శ్రీవేంకటపతి దాసులపై మోహము నెఱి నీకుఁ బ్రియమైతే నేనేకానా రేకు:0252-02ధన్నాసి సంపుటము: 03-297 పల్లవి: ఎందుకుఁ బనిగొందము యేమి సేతమివి యెల్లా చెందిన మాకిఁక బుద్ధి చెప్పవే నారాయణా చ. హరినామ మొకటనే అణఁగెఁ బాపములు వొరసి యన్నినామము లూరకున్నవి సిరులిచ్చెఁ గలవెల్లా శ్రీపతినామ మొకటే