పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/285

ఈ పుటను అచ్చుదిద్దలేదు

283 వున్నతి నివి నీకుండఁగను వెన్నెలయెండలు వెలయఁగ మేల్కొనుటెన్నఁడు నిద్దర యెన్నఁడు నీకు చ. కOదువ సత్రికను(గలువలు ముఖార విందము నిదివో వికసించె ముందర నిదుర మొలవదు చూచిన విందగునీతెలివికిఁ దుద యేది చ. తమము రాజసము తగుసాత్వికమును నమరిన నీమాయూరతులు కమలాధిప వేంకటగిరీశ నిన్ను ప్రమదము మఱపునుఁ బైకొనుటెటూ రేకు: 0323-03 సాళంగనాట సంపుటము: 04–132 పల్లవి: ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి చ. పెట్టినది నుదుటను పెరుమాళ్ళ లాంఛనము దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర నెట్టన నాలుకమివాఁద నీలవరునామమిదె అట్టె పూలిదాసులకOటునా పాపములు చ. మనసునఁ దలచేది మాధవుని పాదములు దినముఁ గడుపునించేది హరిప్రసాదము తనువుపైఁ దులసిపద్మాక్షమాలికలు చెనకి హరిదాసులఁ జేరునా బంధములు చ. సంతతముఁ జేసేది సదాచార్యసేవ అంతరంగమున శరణాగతులసంగ మిదే యింతటాను శ్రీవేంకటేశుఁడు మమ్మేలినాఁడు అంతటా పూలిదాసుల నందునా అజ్ఞానము రేకు:0241-03 ముఖారి సంపుటము: 03-235 పల్లవి: ఉవిదలాల చూడరే వుద్దగిరి కృష్ణుఁడు నవకపు సెలవుల నవ్వుచున్నాఁడు చ. అచ్చపు బాలుఁడై శకటాసురు మర్దించినాఁడు కుచ్చి కాఁగిళ్ల నింతులఁ గూడినాఁడు మచ్చిక దోఁగెడు తాను మద్దులు విరిచినాఁడు పిచ్చిలఁ బూతకి చన్ను పీరిచినాఁడు చ. పిన్ననాఁడే కోడెలతోఁ బెనఁగి గెలిచినాఁడు యెన్నికగా వేలఁగొండ యెత్తినాఁడు నెన్నడిని కొండపాము వెస రెండు సేసినాఁడు పన్ని కంసుని మదము భంజించినాఁడు చ. పొంచి పెద్దవాఁడై భూభారము దించినాఁడు అంచెఁ బాండవులకు దిక్కెనవాఁడు మించి శ్రీవేంకటగిరిమీద నిదె వున్నవాఁడు వంచించక దాసులకు వరాలిచ్చేవాఁడు రేకు: 0198-04 ముఖారి సంపుటము:02-505 పల్లవి: ఊరకే కలుగునా వున్నతపు మోక్షము శ్రీరమణు కృపచేతఁ జేరు మోక్షము చ. కలుషముఁ బెడఁబాసి కర్మగండము గడచి మలసి నప్పుడుగా మరి మోక్షము