ఈ పుటను అచ్చుదిద్దలేదు
68
[అం 2
త గి న శా స్తి
ఉమా--ఏమి టా రాచకార్యము? సువే--రాచకార్యాలు మీకే కాని మాకెక్కడివి? రామారావుగరింట చిన్న Entertainment ఉంది. ఐదు గంటలకి మొదలు, ఎనిమిది కావచ్చును పూర్తి అయ్యేటప్పటికి. ఉమా--పిల్లలమాట? సువే--మీరుంటారు. ఉమా--నాకు తెరపి లెకుంటేనే తలమ్ముకొన్న నాకు స్వేచ్చ ఎక్కడిది? ఈ వేళ treasury account పోవాలి--urgent. నే నుండక వల్లకాదు.ఏమి దారి? సువే--సేలవుచీటీ వ్రాయండి. ఉమా--అమ్మయ్యో! సెలవిస్తారా! డెప్యూటీ కలక్టరు అమాంతముగా గొంతుక కొరుకుతాడు. సువే--జబ్బని వ్రాయండి. తలనొప్పో, జ్వరమో, వాంతులో అని వ్రాస్తే సెలవిచ్చి తీరాలి, చచ్చితీరాలి. ఉమా--చచ్చేటందు కొకరి సెల వక్కరలేదు. ఇప్పటిదాకా గట్టిగా నున్నానని ఎరుగును. ఇప్పుడే కచెరీనుంచి వచ్చినానుకదా, జ్వరమంటే నమ్ముతారా? సువే--నాకెందుకాఘోష. బండీ కావలె. నాకోసము మరికొందరు కాచుకొని ఉంటారు, వాళ్ళతో బండీమీద వస్తానని చెప్పినాను, వెళ్ళకుంటే వేళాకోళము చేస్తారు.