పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/61

ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

51

త గి న శా స్తి

సరో--అదేమిటి! నాకళ్ళకు కనబడుతూ లేనంటా వేమి?

ఇందు--నీ కేవీ తెలియదు నీయెదుట నున్నదీ, నీకు కనబడుతూన్నదీ నాశరీరముమాత్రమే; దానిలోపల హృదయమనే పదార్దము ఉంటుంది, నీ వెరుగుదువా?
 సరో--కవులు ఉన్నదనే అంటారు.
 ఇందు--అది నాకు లేదు.
 సరో--ఎక్కడికి వెళ్ళించి?
 ఇందు--హరించబడినది.
 సరో--దొంగతనమే!పోలీసువాళ్ళకిరెపోర్టుచేతామా?
 ఇందు--నీకేవీ  తెలియదే...నామాట విను. నామనస్సుయొక్క స్దితినిబట్టి చూస్తే పాత్రుడుగారిని వెంటనే పెళ్ళాడి తీరవలెను. అతి జరుగురు, ఆలస్యమైతే విషమిస్తుందేమొ?
 సరో--అలా గతనితో స్పష్టముగా నీవు చెప్పి యుండవలసింది.
 ఇందు--స్పష్టముగా చెప్పితే కవిత్వము కాదే!
 సరొ--కవిత్వము లెకుంటే పీడపోయె, కార్యము నెరవేరి యుండునే. ఇప్పుడేమంటే ఏమి లాబము?
 ఇందు--నీవు చెప్పగలవని చెప్పిరావే. నామనస్సు స్దిమితపడుతుంది.