పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/58

ఈ పుటను అచ్చుదిద్దలేదు
48

[అం 2

త గి న శా స్తి

 సరో--స్వర్గస్ధుడైన మాధవరావుగారి భార్యా.
 పాత్రు--Oh! widow? ఐతే will case అవుతుంది. సరే వారిల్లెక్కడ.
 సరో--ఈ హైరోడ్దు వెంటా ఉత్తరానికి కొంతదూరము వెళ్లవలెను.,
 పాత్రు--(నోటుబుక్కులో  వ్రాసుకొనును)హైరోడ్డు.
 సరో--అక్కడ దేవాలయము కనిపిస్తుంది.
 పాత్రు--సరే, దేవాలయము.
 సరో--దానికి దక్షిణముగాఒక చరు వుంది.
 పాత్రు--దక్షిణము చెరువు.
 సరో--దానికి తూర్పున లాంతరు స్తంభ ముంటుంది. అక్కడికి కొంతదూరాన కాఫీహోటలుంది; దాని కెదురుగుండా పెద్ద మేడ అగుపడుతుంది. అదే వారిల్లు.
 పాత్రు--ఎన్ని గంటలకు వీలుంటుంది?
 సరో--పొద్దుకుంకేసరికి రావచ్చును. కొంచెమాలస్యమైతే చాలా అనుకూలముగానుంటుంది. ఆమె యింటి వద్ద ఉంటారు.
 పాత్రు--నీకీరోజున చాలా cases ఉన్నవి. ఊపిరి సలుపదు. రేపు కొంచెము తెరిపి ఉంటుంది.
 సరో--నేడామెకూ తీరిక లేదు. చుట్టాలు యింటినిండా ఉన్నారు. రేపు మధ్యాహ్నము బండిలో అంతా బయలుదేరి పోతారు. అటు తర్వాతనే మిమ్ము రమ్మన్నారు.