పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/56

ఈ పుటను అచ్చుదిద్దలేదు
46

[అం 2

త గి న శా స్తి

 పాత్రు--నే నెలాగు చేయకుంటే నీకు స్వర్గమేలాగు వస్తుంది...అక్కడికి పోయేటప్పుడు నన్ను నీవెంట తీసుకొని పోతావా?
 రెబె--స్వర్గానికా? నేను వెళ్లడ మేలాగు?
 పాత్రు--నావంటివానికి కూడూ గుడ్డా పెట్టితే పుణ్యము వస్తుంది, అది నిన్ను స్వర్గానికి తీసుకొనిపోతుంది.
 రెబె--Indeed!  I don't want it.
 పాత్రు--నీకు వెళ్ళక తప్పదు.
 రెబె--నేనెప్పుడూ వెళ్ళను, ఈ plea మీద నీఇంట్లో కూర్చుండి హాయిగా మెక్కుదా మనుకొంటూన్నావు. నీ సంగతి తెలిసింది.
 పాత్రు--తెలిసిందా! నీబుద్దేమిటి! సరే, darling, నెకంతా బోధపడ్డది కావున నేనిక దాచడ మెందుకు? నిజము చెప్పుతూన్నాను, నాకు పనిచేయడమంటే తలనొప్పి.
 రెబె--అబధము-It is a lie.
 పాత్రు--అది lie కావచ్చును, కాని ఆమాట నీవు నాయెదు టన

డము న్యాయము కాదు నీకు తెలిసించి కనుక నిజము చెప్పుతాను. To tell you the truth, నాకు practice రావడము లెదు. నన్నేమి చేయమన్నావు?

 రెబె--నీవు చదువవు, ఒకరు చెప్పితే వినవు, practice రమ్మంటే ఏలాగు వస్తుంది? Efforts లెకుంటే కార్య మేలాగు ఫలిస్తుంది?