పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/55

ఈ పుటను అచ్చుదిద్దలేదు
అం 1]

45

త గి న శా స్తి

 పాత్రు--నీకు సాధనాంతరము తోచకుంటే నన్నేదైనా పని చేయమంటావు కాబోలు?
 రెబె--నీ వేమీ చేయతలచుకో లేదు కాబోలు? you are a man-- నే నింతకాలము సంసారము సాగిస్తూంటే, నీవు కాలుమీద కాలువేసుకొని కూర్చుండమరిగి గడపదాటకుండా కాలక్షేపము చేస్తూన్నావు. ఎంతకాలమిలాగుజరుపగలను?  I am a woman for a'that.
పాత్రు--ఎప్పుడూ ఈలాగు జరుగవలెననే నా అభిప్రాయము.
 రెబె--Shame! Fie upon thee!
 పార్తు--నన్నుపోషించ లెనిదానవు why did you marry me?
 రెబె--నేను నిన్ను పోషించవలెనా? O dear dear, ఆడది మగవాడికి కూర్చోబెట్టి కూడు పెట్టవలెనా?
 పాత్రు--మగవాళ్లకి పని లేనప్పుడు ఆడవాళ్ళు గడించి అన్నము పెట్టవలెను, లేకుంటే నరహత్యాపాపము తగులుతుంది.
 రెబె--ఆ ముచ్చట యిన్నాళ్లూ తీరిందిగా? నాచేత నైనంత తెస్తూన్నప్పుడు సంసారము క్లుప్తముగా నడిపి డబ్బు వెనకవేయవలెను కాని, ఎవరైనా నీలాగు తప్పతాగి తగులవేస్తారా?