పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/14

ఈ పుటను అచ్చుదిద్దలేదు
4

[అం 1

త గి న శాస్తి

  సూర్య--పోనీ వీళ్ళని divorce చేతాము, శని వదలిపోతుంది.
  రామ--సరిసరి. మనలో అది లేదు. హిందూ లా ప్రకారము వీలులేదు. వివాహసంబంధము విదిపోదు.
  సూర్య--అయ్యో! మనఋషుల కెంత మతిపోయింది!
  పూర్ణే--రామచంద్రం, నీవేదైనా సాధనము చెప్పవా!
  రామ--నాకొకటి తోచింది, మనకు నచ్చినదాని నింకొకర్తెను పెళ్ళాడడమే; దానితో వీళ్ళ చిక్కు మరుండదు; "అధికం తున దొషామ" అని శాస్త్రకారుడే  చెప్పినాడు.
  పూర్ణే--అది నాకు నచ్చలేదు.
  ఉమా--ఏమి?
  పూర్ణే--బాబో! ఒక్కర్తెను కట్టుకొంటేనే ఇంటినిండా కిచకిచలాడుతూ కిష్కింధ ప్రత్యక్షమయిందే, రెండోదాన్ని చేసుకొంటే లంకాపురి కావడానికి కాటంక ముందా? 
  సూర్య--అదీకాక, ఒక్కర్తెతోనే వేగలేక తంటాలుపడి తన్నుకొంటూంటే రెండోదాన్ని పీక కురిపోసుకోమన్నావా?
  ఉమా--మన మట్టిబుర్రలకి మంచిమార్గము తట్టనే లేదు ఏమి గతి? (పాత్రుడు వచ్చును) Good-morning పాత్రాగారూ!