ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

తెలుగు నవల

విశ్వనాథశాస్త్రి సమర్థవంతంగా నిర్వహించారు. ఇతనిలో ఏదో కసీ, ప్రతీకారమూ, సమాజాన్ని వంచించి దోచుకొనే రూపంలో సాక్షాత్కరం అవుతాయి. అందులో ఆశ్చర్యపడవలసిందిలేదు. గవరయ్య పాత్ర చిత్రణలో రచయిత సునిశితమైన ప్రతిభ చూపాడు. సుబ్బయ్య బావమరిది వెంకటరావుపాత్ర కూడా సహజమైనది. రెండు తరాల క్రింద సంఘంలో అటువంటి మనుషులు ఎక్కువ గానే కనపడేవాళ్ళు. పడిపోబోతున్న ఒక వ్యవస్థ యొక్క చిన్న చిన్న స్తంభాల లాంటి వాళ్ళు వెంక ట్రాపువంటి వ్యక్తులు. జమీందారులు ఆ వ్యవస్థ తాలూకు పెద్ద స్తంభాలు. దోపిడీ వ్యవస్థ మూల స్తంభాలు. పనీపాటలు లేకుండా, అన్యాయంగా ముందుతరాల వాళ్ళు ఆర్జించిన ఆస్తిపాస్తులతో విలాసజీవనం గడిపే కొందరు వ్యక్తులు వెనకటి తరాల్లో బాహాటంగా కన్పించేవాళ్ళు. వెంకట్రావులోని నయవంచన, ఔద్ధత్యం, డాబు, రచయిత నేర్పుగా వర్ణించాడు. ఇతివృత్తం, కథాకథనం, నిర్వహణం మొదలైన వీటన్నిటినీ మించి భాషావిషయికంగా అపూర్వతను సాధించాడు విశ్వనాథశాస్త్రి. ఇందులో ఆయన వ్రాసినభాష, వాక్య నిర్మాణం, అనితర సాధ్యం అనిపిస్తాయి. అన్నిటా నవ్యతను సాధించిన నవల అల్ప జీవి

పందొమ్మిదివందలయాభైలలో అల్పజీవి వచ్చింది. పందొమ్మిదివందల డెభై వచ్చేసరికి మరొక అద్భుతమైన నవలను తెలుగువాళ్ళ కందించారు విశ్వ నాథశాస్త్రి గారు.

'రాజు_మహిషి' అనే పేరుతో ఆయన వ్రాసిన నవల అది. ఇందులో రచయిత ప్రేమ, మనిషి, దైవం, న్యాయం, ధర్మం, సత్యం, మానవ జీవితంతో, ఏవిధంగా చెలగాట మాడుతూ, చెలామణి అవుతున్నాయో చిత్రించారు. "తెలుగులో సంతృప్తికరమైన కవిత్వం వచ్చినట్లు, కథలు వచ్చినట్లు, నవలలింకా రాలేదని నాదో చిర కాలపు ఫిర్యాదు ఉంది. ఈ నవల సమగ్రమైన మంచి నవలగా రూపొందుతుందని నాకు విశ్వాసం ఉంది " అన్నారు శ్రీ శ్రీ ఈ పుస్తకాన్ని గూర్చి వ్రాస్తూ. ఇది ఇరవైయ్యో శతాబ్దపు క్లాసిక్ గా నిలుస్తుందని శ్రీ శ్రీ మెచ్చారు. నిస్సందేహంగా గొప్ప నవల వ్రాసేరు విశ్వనాథశాస్త్రి గారు ఇందులోని పాత్ర చిత్రణలో అనంతమైన వైవిధ్యం చూపించారు రచయిత. ఛైర్మన్ భీమ సేనరావు, మందుల భీముడు, జమీందారు పురుషోత్తమరావు, రంగారావు, ప్రసాద్, మిస్ ప్రేమ, హెడియో, గేదెల రాజమ్మ, ప్రపంచంలోని చిత్రవిచిత్ర సహజ స్వాభావిక ప్రవృత్తులకు ప్రతినిధులు. ఆధునికసంఘంలో ఏయే వేళల