ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

21

రచయితలెవ్వరూ అర్థం చేసుకోలేదని, చలాన్ని మెచ్చేవాళ్ళు అంటారు. చలం గొప్ప భావుకుడు. కవి. ఉద్రేకి ఈ లక్షణాలు ఆయన సర్వరచనలలోనూ కనపడుతూ వుంటాయి. సాంఘిక ప్రబోధంకోసం, సంఘ సంస్కరణంకోసం, చలం రచనలు చేసిఉంటే, అవి కవిత్వధోరణిలోనూ, ప్రతీకాత్మకంగానూ, మార్మికంగానూ ఉండటం, ఎంతవరకు ఆయన ఆశించిన ప్రయోజనాన్ని సిద్ధింప చేశాయో, ఆ చలానికే తెలియాలి. చలం ఘోష, చలం భాష, అసామాన్యమైనవి. సామాన్యుడికి అర్థమయ్యేవికావు. సాంఘిక పరిణామాలు, ఆర్థిక, రాజకీయ పరిణామాల మీద, ప్రపంచవ్యాప్తమైన అనేక ఉద్యమాలమీద ఆధారపడి ఉంటాయి. రైళ్ళు, కాఫీ హోటళ్ళు సినిమా హాళ్ళు, వార్తాపత్రికలు, నిత్య జీవితాన్ని సాంఘిక వ్యవస్థలో ప్రభావితం చేసినంతగా చలంగాని, విశ్వనాథలుగాని ప్రతిపాదించే సిద్ధాంతాలు, సాహిత్యరచనలు ప్రభావితం చేయలేవు. ఇట్లా చెప్పటం సాహిత్య ప్రభావాన్ని కించపరచటంకాదు. చలం సిద్ధాంతాలను చెనకటమూకాదు.


తెలుగు నవలాసాహిత్యంలో ఈ కాలవిభాగానికి చెందిన మరొక ప్రతిభావంతుడైన నవలా రచయిత నోరి నరసింహశాస్త్రీ, ఈయన పండితుడు. వ్యుత్పన్నుడు. చారిత్రక నవలా రచనలోనే ఈయన ప్రత్యేకించి కృషి చేశారు. అదిన్నీ తెలుగుదేశపు చరిత్రకు సంబంధించిన నవలలే వారు వ్రాశారు. రుద్రమదేవి, నారాయణ భట్టు, కవిసార్వభౌముడు, కవిద్వయము, ధూర్జటి, మల్లారెడ్డి, మొదలైన నవలలన్నీ , తెలుగుల చరిత్రకు ఔజ్జ్వల్యం చేకూరుస్తూ రచించారు. చారిత్రక నవలలు వ్రాయటంలో, నాటి సామాజిక వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, భావుకతాస్ఫోరకంగా, పాత్రచిత్రణలో సజీవతా రామణీయక స్ఫూర్తితో, ఇతివృత్త నిర్మాణం చేయడం నోరి వారి రచనా విశిష్టత. రాణివాసపు గాథలు,రాచవీరుల పరాక్రమ కథనాలూ కాకుండా, కవిమూర్ధన్యుల కమనీయ జీవితవృత్తాంతాల చుట్టూ కథలల్లడం, నోరి వారి చారిత్రక నవలల్లో చూడవచ్చు. బహుముఖమైన శాస్త్ర పాండిత్యము, వైదుష్యము, కావ్య నాటకాలంకారిక విజ్ఞానము, అనుసంధించి పాత్రచిత్రణం చేయటం, యుద్ధ ఘట్టాలు వర్ణించవలసినప్పుడు ఆశ్చర్యావహమైన విషయ వివరణమూ, నోరి నరసింహశాస్త్ర గారి చారిత్రక నవలల్లోని విశిష్టత. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నంచేసిన మహా కవుల జీవితకాలాలకు సంబంధించిన చరిత్ర అంతా నవలలుగా నోరి వారు