ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

తెలుగు నవల

నవలలు, హిమబిందు, గోనగన్నా రెడ్డి, అడవి శాంతిశ్రీ, మొదలైన చారిత్రక నవలలు బాపిరాజు ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. బాపిరాజు నవలల్లో ఇతి వృత్తానికి అపరిహార్యం కాని విషయాలు కూడా విశేషంగా చోటు చేసుకొంటాయనే, పాత్రచిత్రణం. వర్ణనలు మొదలైనవాటిలో వైవిధ్యంకూడా చెప్పుకోదగినంతగా కనిపించదనీ ఒక విమర్శ ఉన్నది ఆకాలపు రచయితలు నవలలు వ్రాసే కాలానికి నవలా శిల్పం నేటి కాలానికివలె నిర్ధారితం కాలేదు. ప్రతిపాదితమూ కాలేదు. ఆధునిక కవిత్వలక్ష ణాలతోనూ అది ఉద్దేశించిన ప్రయోజనాలతోనూ, పోల్చి ప్రాచీన కావ్యసాహిత్యాన్ని విమర్శించినట్లు ఉండకూడదుకదా నేటి ప్రమాణాలతో బాపిరాజు నవలలను విమర్శించటం. 1933వ సంవత్సరంలో విశ్వనాథ సత్యనారాయణగారితోపాటు బాపిరాజు కూడా ఆంధ్ర విశ్వకళాపరిషత్ బహుమతిని అందుకొన్నారు. ఆయన 'నారాయణరావు' నవలకు. విశ్వనాథ 'వేయిపడగల' తో బాటుగా యూనివర్శిటీ బహుమానం ఇచ్చింది.

ఈ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప సంచలనాన్ని సృష్టించిన రచయితగా చలానికి అగ్రేసరమైన స్థానమున్నది. చలం చెల్లుబాటవుతున్న సమకాలీన సాంఘిక వ్యవస్థ పైన గొప్ప తిరుగుబాటు చేశాడు ఉవ్వెత్తుగా సాహిత్య తరంగాలతో విరుచుకొనిపడ్డాడు. ఉప్పెనలా పాత భావాలను ముంచాడు. కడలిలా రోదించాడు. గాలిలా తన ఉనికిని అందరికీ ఇష్టమున్నా లేకపోయినా తెలియజేశాడు. చలం సాహిత్యం ద్వారా సాధించింది వివాదాస్పదం. ఏభై అరవై సంవత్సరాల క్రితం సాంఘిక వ్యవస్థ పూర్తిగా అర్థం చేసుకొంటే కాని చలం రచనలు, అవి ప్రతిపాదించే సిద్ధాంతాలూ అర్థంకావు. నాటి సాంఘిక వ్యవస్థలో ప్రచురంగా కనపడిన పురుషుని దౌష్ట్యం. ఆత్మ వంచన, అల్పత్వం, నీచత్వం, చలానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. దీనికితోడుగా స్త్రీలు అన్యాయానికి, వంచనకు, బానిసత్వానికి, గురికావడంచూసి, ఆయన ఓర్చుకోలేక పోయినాడు. చలం రచనలకు ఆనాడు చలం దర్శించిన సంఘమే చాలా వరకు ప్రోద్బలకమై ఉంటుంది. ఆయన వ్రాసిన అమీనా, బ్రాహ్మణీకం. దైవమిచ్చిన భార్య, మైదానంవంటి నవలికలలో ఆయనకు ఎదురైన సాంఘిక ప్రతినిధులనే ఆయన చిత్రించి ఉండవచ్చు. ఆయన దర్శనం వేరు. అది ఆయన దృష్టితో చూస్తే ఆర్థంకావలసిందే. మానవ ప్రకృతిలోని అతిబలమైన ప్రవృత్తిని ఆయన అర్థం చేసుకొన్నట్లుగా, అద్దం పట్టి చూపినట్లుగా, విశ్లేషించి వివరించినట్లుగా, సమకాలీన