ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

19

ఏక వీర నవలలో విశ్వనాథ చూపిన శిల్ప ప్రతిభ చాలా గొప్పది. అది మధుర ప్రాంతాలను పరిపాలించిన రాజకుటుంబపు ప్రణయగాథ రసవత్తరమైన కావ్యంలా సాగుతుంది ఈ నవల.

వేయి పడగలు సంగ్రహవిజ్ఞాన సర్వస్వంవంటిది. సాహిత్యము, మతము. రాజకీయాలు, సంస్కృతి, అన్నీ యీ నవలలో ప్రస్తావికంగా సమీక్షితాలైనవి పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్ధంలో ప్రారంభమైన సాంస్కృతిక పునరుజ్జీవనము. మత రాజకీయ సాంఘికోద్యమాలు, ప్రాచీనకాలం నుంచీ చెల్లుబాటవుతున్న సాంఘిక వ్యవస్థతో నవీనాదర్శాలకు సంఘటించిన సంఘర్షణలు, ఆధారంగా చేసుకొని తెలుగుదేశంలోని యుగసంధి పరిణామాలను విశ్వనాథ వారు వేయి పడగలలో వివరించారు. గతించిపోతున్న ఒక వ్యవస్థ తాలూకు చరమదీప్తులను చూచి ఆయన నిట్టూర్పులు విడుస్తున్నట్లు కనపడుతుంది. వేయిపడగలద్వారా అయన అందించదలచిన సందేశాన్ని బట్టి చూస్తే.

చెలియలికట్ట, తెరచిరాజు, స్వర్గానికి నిచ్చెనలు, మాబాబు, జేబుదొంగలు, మొదలైన నవలల్లో మత, సాంఘిక విశ్వాసాలు ప్రతిపాదితములైనవి. ధర్మ చక్రం, కడిమిచెట్టు, బద్దన్న సేనాని మొదలైన నవలల ద్వారా, ఆయనగారి బహుముఖీనమైన ప్రతిభ వెల్లడవుతున్నది. కొత్తదైన గవేషణతో, నూత్నమైన విశ్లేషణతో, చరిత్రను పురాణాలను, విశ్వనాథ వ్యాఖ్యానించి నవలలరూపంతో అందించారు. సాహిత్య జీవితంలో నలభై సంవత్సరాల కాలం అవిచ్ఛిన్నంగా నవలలు వ్రాయటం విశ్వనాథలోని ప్రత్యేకత. విశిష్టత కూడా.

స్వర్గీయ అడవి బాపిరాజు అన్నిటా భావుకుడు. గంధర్వలోకాలనుండి శపుడై(?) వచ్చి తెలుగుదేశంలో కవిగా, చిత్రకారుడిగా, భావుకుడుగా, సౌందర్య పిపాసిగా, కళావేత్తగా ఆయన జన్మించారేమోననిపిస్తుంది. తెలుగుదేశం, తెలుగుభాష, తెలుగు చరిత్ర , తెలుగు విజ్ఞానం, తెలుగు అన్నది ఏదైనా ఆయనను పులకింపచేసేది, పరవశింపచేసేది. బాపిరాజు ఎంత భావుకుడో అంత పండితుడు. ఆయనలో హృదయమూ, మేధా, కూడా వికాసపారమ్యాన్ని పొందాయి. లలితమైన భావన, మృదులమైన ఊహ, భావుకతా పారమ్యాన్ని అందుకోగల సౌందర్యదర్శనం, బాపిరాజు రచనలలోని నాయికానాయకుల పాత్ర చిత్రణలో కనపడతాయి. అచ్చమైనకవి. ఆదర్మోన్ముఖమైన వాస్తవిక చిత్రణం ఆయన ధ్యేయం. నారాయణరావు, కోనంగి, మొదలైన సాంఘిక