ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

తెలుగు నవల


స్వీయ చరిత్రలో వ్రాశారు. ఈ గజదొంగను ప్రభుత్వం చాలా కాలానికి గాని పట్టుకొని దారిలోకి తీసుకొని రాలేకపోయిందట. జ్యోతి, అప్పాదాసుల అలౌకికమైన ప్రేమ వృత్తాంతం చాలా గంభీరంగా, ఉదాత్తంగా చిత్రించారు రచయిత. నల్లమోతు చౌదరయ్య, ఆయన కొడుకు రామానాయుడు, కోడలు కమల, మనవడు సాహూకృష్ణ, భార్య లక్ష్మమ్మ, పెంచిన కొడుకు వెంకటయ్య, రామదాసు, ఆయన కొడుకులు వెంకటదాసు, సంగదాసు, రంగడు, కూతురు జ్యోతి, మేనల్లుడు అప్పాదాసుల పాత్ర చిత్రణంలో గొప్పనేర్పు చూపించారు రచయిత. పెద్దింటికోడలు కమల లేచిపోతుంది. ఆ కమల పాత్రచిత్రణం అత్యంత వాస్తవికంగా వుంది. అసమానమైన ప్రజ్ఞకనపరిచారు ఆమె పాత్రచిత్రణంలో ఉన్నవవారు. పోలీసు డిపార్టుమెంటు ఇలాకాలో జరిగే దొంగతనాలు, జైళ్ళలో జరిగే అక్రమాలు, జైలు సర్జన్లు, వార్డర్లు, ఆఫీసర్లు, - జైలు ఖైదీల రేషన్లను ఎవరెవరు ఎట్లా ఎంతెంత పంచుకొని తినేదీ, ప్రభుత్వ శాఖల్లోని అవినీతి, లంచగొండితనం , అక్రమార్జనలు, హృదయ విదారకంగా వర్ణించారు ఉన్నవవారు. 1921 వ సంవత్సరానికే సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ఆగ్రహంచెంది విప్లవపంథాను ఆయన ప్రతిపాదించి వర్ణించటం, చాలా ఆశ్చర్య కరమైన విషయం. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ యంత్రాంగంలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చిన అవినీతి, ఆలసత్వం, ఆశ్రితపక్షపాతం మొదలైనవాటినిగూర్చి ప్రస్తావిస్తూ పెద్దవాళ్ళు 'మా హయాంలో ఇట్లాకాదు , బ్రిటిషు ప్రభుత్వం పరిపాలనలో ప్రజలకు, ప్రభుత్వాధికారులకు భయభక్తులు, క్రమశిక్షణ, ఎంతగానో వుండేవి' అని ఆ గత కాలాన్ని గూర్చి అంగలార్చడం వింటూవుంటాం కాని మాలపల్లి చదివితే, ఆ సమాజంలోని దురన్యాయాలన్నీ ఆవిష్కారమవుతవి. నేరాలు చేసే జాతులుగా కొందరిని పరిగణించి, వాళ్ళకు సెటిల్మెంటు లేర్పచడం, అక్కడి జీవిత విధానాలు, నిర్బంధించి శరీరకష్టం చేయించటం, అనేక విధాలుగా ఆ అమాయకులను హింసించటం. ఇవన్నీ కరుణాత్మకంగా చిత్రించారు రచయిత. 'వాడుక భాషయందు నవరసభరితమైన కావ్యమును రచించిన లక్ష్మీనారాయణగారు ధన్యులు'. అన్నారు కాశీనాథుని నాగేశ్వరరావుగారు పీఠికలో, స్వరాజ్యం వచ్చేసిందని, పర ప్రభుత్వం స్థానంలో ప్రజాస్వామిక దేశీయ ప్రభుత్వం ఏర్పడి సురాజ్యం రూపొందిందని సామాన్యుడి 'జీవితం మూడు పువ్వులు ఆరుకాయలైందని, సామాన్యుడి జీవితాన్ని స్వర్గతుల్యం