పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/199

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

తాలాంకనందినీపరిణయము

ఆశ్వాసాంతము

ఉ.

పారదశారదాభ్రదరపంకజకుందపటీరమల్లికా
నారదచండ్రఖండహిమనాగకులాధిపరౌహిణేయమం
దారమరాళచందనవిధాతృసతీశరతారహారడిం
డీరసురాధ్యజిష్ణుకరటిప్రతిభాచ్ఛయశఃప్రదీపితా!

291


పంచచామరము.

 పురందరప్రభృత్యమర్త్యపూజితస్వపత్కజా!
మరందతుల్యవాగ్విలాసమంజులాస్యనీరజా!
అరిందమప్రతాపనిస్తులాయతస్ఫురద్భుజా!
ధురంధరప్రభాపతంగతుంగమంగళధ్వజా!

292

నాగబంధము

చ.

ఖరకరకోటిభారవరకారణభవ్యదయారసౌఘదు
ష్కరమదవైరిదూరకరసారసవిస్ఫుటితాగశోభనా!
సురవరమేనసారధరశూరకవిస్ఫురితారభావితా
స్థిరఖగమోదకార, భవసేవనఘట్టనవాదకోవిదా.

293