పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/178

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

123


వరు తనుతాపమార్ప ప్రసవంబులు సౌరభమెల్ల నింపి త
త్తరుణిని గూర్తు నంచుఁ దనుఁదాఁ జనుదెంచిన భాతి భాసిలెన్.

201


చ.

అరయ వనప్రియాకలితమై సితపత్రములుం దొలంగ వే
మరు శరము ల్వికాసగరిమం గన పాంథజను ల్వడంక ది
వ్యరుచిరదీప్తిచే కువలయం బొకవింత జెలంగ గ్రీష్మముం
గరము రహించె సారసవనప్రియమై జలదాగమంబునన్.

202


చ.

ఘనలతికాలతాంగు లను గారవ మొప్పఁగ దక్షిణానిలుం
డెనయ తుషారమన్ ముసుకులెత్తి విదల్చుచు పుష్పమంజరీ
స్తనములఁ బల్లవాంగుళులఁ దార్కొని యంటుచు పత్రభంగమై
జన బలుతావు లానుచు వెసం బెనగెన్ రుచిజూపి యత్తఱిన్.

203


చ.

మదనుని కూర్మిమిత్రుఁ డల మాధవు పూర్వతపఃఫలంబ నా
గుదిరిన వాతపోతమునకుం బువుదేనియ జల్కమార్చి యిం
పుఁదనరు పూలడోలికల పొత్తిలి లేఁజివురుల్ ఘటించి మే
లొదవఁ బికస్వరంబుల ననోకహకాంతలు బాడి రుయ్యలల్.

204


మ.

తనభానుప్రభకుం దొలంగి హిమగోత్రశృంగముం జేరు శీ
తనికాయంబును బట్టి యాతని జగత్కంపప్రదాభీలఖే
లనదోషాధికవృత్తి మాన్ప నవలీలం బంకజాతాప్తుఁ డం
తను దాక్షిణ్యము వీడి యుత్తరదిశాస్థానంబు జేరెంగదా.

205


మ.

మరుఁ డక్షీణఘనధ్వజప్రతిభ గ్రమ్మన్ జైత్రముం జూడ తె
మ్మెరతే రెక్కి జనంగఁ దద్గరిమ పేర్మిం జూడఁగా సాలవి
స్ఫురసౌధాగ్రము లెక్కి పల్లవకరాంభోజంబులం గుట్మలో
త్కరముం జల్లిరి వల్లికాతరుణు లుద్యద్భావిభవ్యాప్తికై.

206


సీ.

మంజులమహిళాభ్రమరకంబుల హళా
        హళి సేయుచును బ్రాకులాఁడి యాఁడి