పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/170

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

115


రీతి న్నాతికి నావిధం బెరుఁగ బేర్మిం దెల్పు నీమేలుమ
చ్చేతోవీథి నహర్నిశంబు విడకం జింతింతు ధారాధరా.

167


చ.

అని వినుతించి కొంతతడ వాత్మ దలంచి యహా! యితండు మ
నుబ్బున బెడబొబ్బలన్ వదుఱుబోతని నేవినియుండి తెల్వి లే
కను వినుతించు టీవెతలుఁ గైకొని యాసతితోడఁ దెల్పు నే
వనిత సరోజనేత్ర యని వైరమునం గసిదీర్పకుండునే.

168


క.

పెడబొబ్బ లఱచుకొనుచున్
సుడిగాలిన్ సోకి దిరుగుచును బెనుడాలన్
వడి రువ్వి పిడుఁగు వై చెడి
చెడుగును ఘనుఁ డనుచు వినుతి సేయం దగునే.

169


సీ.

తేజమెల్ల నడంచె రాౙని చూడక
        పటుసంపదల వాపె పద్మినులను
కడలఁ ద్రోయుచు నైల్యగతిఁ జూపె ఘనులను
        గలగించెఁ బంకిలగతి సరసుల
మేలోర్వక గుదించె మిత్రప్రతాపంబు
        బోనడంచెను తపస్ఫూర్తి నెల్ల
కొంచకరూపు మాయించె సత్పథమును
        జడిపించె పరమహంసవ్రజములఁ


గీ.

దాను జంచలవృత్తి నెమ్మేన బూనఁ
గౌను బొగలెక్కు విషధరాగమముతోడ
నెటుల దరియింప వశమునేఁ డింకమీఁద
నహహ శరదిందుముఖి రూప మరయకున్న.

170


క.

అంత నిరంతరచింతా
క్రాంతస్వాంతమ్ముచే నృకాంతుఁ డుపవనా
భ్యంతరమున వెత జెందఁగ
నంతటిలో ప్రావృడాగమాంతం బగుటన్.

171