పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/168

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

113


సీ.

తగు పెంపొసఁగవె యాపగవారికైనను
        జయముల నీవె కుజనులకైన
కడిమి భరింపవే కడవారి నిధులైన
        గని పూనవే పరాగంబు నైనఁ
బ్రియము గూర్పవే సర్పభయదాయకులకైన
        నాజ్ఞలో జనవె గోత్రారికైన
దయ నింపలేవె యెంత జడాశయులనైనఁ
        గలిమి నీలేవె చంచలులకైన


తే.

యిట్టి నీసిరి శిరసావహించియున్న
నీలవేణికి మరులొంది జాలిచెంది
వరలు నాసేమ మరయఁగా వచ్చినావొ
వాసవోపలసమదేహ వారివాహ.

161


చ.

అల శశిరేఖగీతకలనాభ్యుదయోన్నతిఁ జెందు నీవు న
చ్చెలితలమిన్నగారవముచే మును బెంచు శిఖావళార్భకా
వళికి ముదంబుగా నటనవర్తన జూపుచు దద్గ్రహాంగణా
కలితవనాళివృద్ధి గనఁగాఁ దగుఁ బ్రోచెదవే బలాహకా.

162


సీ.

పెనువిరహార్తి సిబ్బెఁపుగుబ్బ సెగలపై
        జల్లిన పన్నీటిపెల్లు పొగలు
మరుతాపవహ్నిఁ బ్రజ్వరిలు మేననలంచు
        ఘనసారమున రవుర్కొనిన దీప్తి
పరిలిప్తపాటీరపంకమహాదారు
        ణోశ్వాసమున వెడలుడుకుగాలి
నెదనించు పల్లవచ్ఛదముల సెగనుబ్బ
        గుబ్బతిల్లుచు బయల్గొనిన చెమట