పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/166

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

111


చిమ్మచీఁకటి కారాగృహమ్ము లట్లు
గాఁగ బెంపొందె నప్ప్రావృడాగమంబు.

150


చ.

కలిగె ఘనాగమంబు ఘనగర్జితమం డుబుడుక్కమ్రోయ చం
చలవలవా టొనర్చి హరిచాపము జాబిలి రేఖఁ బూని నె
మ్ముల బలుకేకలున్ శకునముల్ దగ నంచలకున్ బలాకికా
వలికిని కీడు మే ల్దెలుపవచ్చిన యా డుబుడుక్కవాఁ డనన్.

151


క.

గగనమున వానజేగురు
లగబడ గాలాహిసాధ్వసాకులతదిశల్
దగలఁ దెగతిఱిగెనను బొ
ల్పుగఁ దెమ్మెర లపుడు నేలబొరయుచు విసరెన్.

152


చ.

అల జలదం బనేటి గణకాగ్రణి వానకు లెక్కఁజేయుచో
నిల నొకకొంత, కాననమహీస్థలి కొంత, మహాజలార్ణవం
బుల నొకకొంత, సప్తకులభూధరకోటుల కొంత యంచు ము
వ్వలుగల గిల్కుగంటముల వ్రాయు రవంబన నొప్పె గర్జనల్.

153


మ.

తమముం దేజము లోకమెల్లఁ గొని హుద్దాహుద్ది శంపాభ్రరూ
పములం బోరఁగ దత్కచాకచిన దెంపై ధారుణిన్ వ్రాలు ఖం
డములో నావడగండ్లు జూపడియె వేండ్రంబైన దద్రక్తబిం
దుమతిభ్రాంతిదమై జనించే భువియందున్ శక్రగోపావళుల్.

154


క.

మునుపటి మాయప్పులు మర
ల నొసంగు మటంచు భూమిలలనామణి పం
పున నభ్రభటుఁడు గిరగీ
సినగతి పరివేష ముల్లసించెఁ దరణికిన్.

155


సీ.

సతతోపవాసాచరితచాతకవ్రత
        పరిపూర్ణశుభఫలప్రదగురుండు