పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/162

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

107


చంద్రఖండమునెంచు సతిచెక్కులనె గాదు
        రమణీయమందహాసమున మించుఁ


తే.

గాన యీచానతో నసమానమూన
బూనుననుదాని ద్రిజగాననైన నేను
గాన గానికనైన యనూనమైన
సూన బాణాన మేనూనలేను గాన.

131


ఆ.

ఘనముకన్న ఘనము కచబంధనచ్ఛవి
మెఱుఁగుకన్న మెఱుఁగు మేనిసొబఁగు
విపులకన్న విపులము పడంతిసుశ్రోణి
[1]దానికన్నమిన్న దానినడలు.

132


తే.

సౌరు బొలుపారు చీమలబారుఁ గేరు
నారు నలరారు నఁనటులతీరు నూరు
తారతారలఁ దూరు చెన్నారు గోరు
లీరమణి మీరు నారు లెవ్వారులేరు.

133


చ.

సరసత నీవధూటి తనసందిటిలో ననుజేర్చి గబ్బియ
బ్బురపుమెఱుంగుగుబ్బలను బొందుగ నాయురమందు జేర్చి
తెఱనిడి మోము మోమున గదించి ముదంబు జెలంగ నామనో
హరము లెఱింగి కూడెడు మహావిభవంబు లభించు టెన్నఁడో.

134


ఉ.

గోరున గుబ్బ లొత్తి జడకూఁకటి జేకొని మోము మోమునం
జేరిచి, కన్నుదమ్ము లరఁజేయుచు నుస్సున లేతసీత్కృతుల్
సారెకు సల్పి చెక్కుటరచందురులం బలునొక్కు లుంచి వే
మారు సుధారసంబు చవిమానక నీసతి గూడు టెట్లొకో.

135


వ.

ఇ ట్లభిమన్యశశిరేఖ లన్యోన్యమోహాతిరేకంబు లేకీభవించి బ్రత్యూషంబు
తెఱంగున బ్రచ్ఛన్నదారకంబై సత్కవికల్పితకావ్యంబుకరణిఁ బ్రకటీ

  1. దాని = ఏనుఁగు