పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/159

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

తాలాంకనందినీపరిణయము


లారసికోక్తు లాసొగసు లాజగదేకమనోహరాంగశృం
గారములెల్ల నాకనులగట్టినటున్న వికేమి సేయుదున్.

118


క.

ఈయనువున శశిరేఖా
తోయజముఖి విరహజనకదోదూయత లోఁ
బాయక చింతిలుచుండగ
నాయభిమన్యుండు నిజహృదంతరసీమన్.

119


క.

పిన్నతనంబున నేని
క్కన్నియతో శైశవప్రకారమ్ముల ము
న్నున్నగతిగాదు యిది నా
కన్నుల కొక్కింత వింతగా గననయ్యెన్.

120


మ.

మరు లెంతోఘనమై మనంబుధృతి నిర్మగ్నంబు గావించె ని
త్తరుణీరత్నమ నాగతం బెఱిఁగి కందర్పశ్రమం దీర్పఁగా
పరిరంభాద్యుపచారరీతులను సంభావింపఁగా లేనిచో
మరునిం జూచిన బచ్చిబోయఁ డిక మోమోటంబు దానెంచునే.

121


వ.

అని తనలోన.

122


క.

పరులెవ్వరు లేనియెడన్
మఱుఁగున శశిరేఖహృదయమర్మము దెలియం
బరికింతమని దలంచును
బరులుం గనుఁగొనిన జిన్నపని యనియంచున్.

123


సీ.

కలికిచెంత వసించుఁ గౌఁగిలించదలంచు
        మాటమించునటంచు మది భ్రమించు
తనభావ మెఱిఁగించుఁ దలఁపున నుంకించు
        సమయంబుగాదంచు శ్రమ వహించు
వలపులు రెట్టించు వారచూపులఁ గాంచు
        నేరుపు లూహించు దూర మెంచు