పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/86

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

స్వీయ చరిత్రము.

నే నప్పటికే బహుదేవతారాధనమును విడిచి యేకేశ్వరోపాసనమును బూనిన వాఁడనై యుంటిని. వివేకవర్ధని మొదటి మూడు పత్రికలనుండియు వరుసగా నొక్కొక్కటిచొప్పునఁ గైకొనఁబడిన యీక్రిందిపద్యములవలన నాపరిశుద్ధాస్తికభావము తేటపడవచ్చును -

           సీ. అక్ష్యాదిబాహ్యేంద్రియాగోచరుండయి
                      యాత్మస్వరూపుఁడై యలరువాఁడు !
              సచరాచరంబైన సర్వసృష్టికి నాది
                      కారణుండయి చాలఁ గ్రాలువాఁడు !
              దుష్టశిక్షణమును శిష్టరక్షణమును
                      నాత్మకృత్యములుగ నమరువాఁడు !
              సర్వజ్ఞుఁడయియుండి జనులెందుఁ గావించు
                      సుకృతదుష్కృతములఁ జూచువాఁడు !

              నిత్యుఁ డీశ్వరుఁ డభవుండు నిర్మలుండు
              నాదుపత్రికారత్నంబు నాదరమునఁ |
              బ్రబలఁగాఁ జేసి యెల్లెడ వాసి కెక్క
              నించు కంతదయ ననుగ్రహించుఁ గాత ! ||

           సీ. ఎవ్వనియిచ్చమై నెల్లజగమ్ములుఁ
                      గలుగుచు వెలయుచుఁ బొలియుచుండు |
              నెవ్వనికట్టడి నేప్రొద్దు విడువక
                      విన్నున ఱిక్కలు వ్రేలుచుండు |
              నెవ్వనిగొనముల నెంతవలంతులుఁ
                      గడముట్టఁ దెలియంగఁ గానకుందు |
              రెవ్వనియానతి నించుకైనను మేర
                      మీఱక సంద్రముల్‌మించి నిలుచు |