పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

స్వీయ చరిత్రము.

నని కోరుచుంటిని. ఐనను నామనస్సైశ్వర్యాధికారములనిమిత్త మెప్పుడును ప్రాఁకులాడుచుండెడిది కాదు. అచ్చ తెనుఁగుకావ్యముల నొకరిద్దఱే రచియించిరని యెఱిఁగి యుంటిని; నిరోష్ఠ్యకావ్యము నొక్కకవియే రచియించెనని వినియుంటిని; నిర్వచన కావ్యము నొక్కకవియే రచియించియుండెనని తెలిసికొనియుంటిని. అందుచేత సామాన్య కవులు పోయిన మార్గమునఁ బోవక యీమూడు లక్షణములు నొక్క కావ్యమునందే కూర్చి యసాధ్యమైన క్రొత్త త్రోవను త్రొక్కవలెనని నాకప్పుడు సంకల్పము జనియించెను. సాధారణముగా నాకు సంకల్ప ముదయించుటకును తదనుసారముగా కార్యారంభమున కుధ్యమించుటకును చిరకాల మంతర ముండదు. ఇట్లు సంకల్పోదయము కాఁగానే లోకానుభవశూన్యుఁడను పాండిత్యవిరహితుఁడను నగునే నెక్కడ లోకానుభవశాలులైన విద్వాంసులకును దుస్సాధ్యమగు మహాకావ్యరచన యెక్కడనని శంకింపక, బాల్యచాపలముచే సాహసము చేసి "శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచననైషధ" మను పేర నలచరిత్రమును జేయఁబూనితిని. ఇది ప్రౌఢకావ్యము కాకపోయినను నాపూనినప్రతిజ్ఞ నెట్లో నిర్వహించి కృతకృత్యుఁడను కాఁగలిగితిని. ఈకాలమునందే "రసిక జనమనోరంజన"మను పేర వొక మిశ్రప్రబంధమునుగూడఁజేయ నారంభించితిని.

ఆకాలమున చిత్రపు కామరాజుగారు మండలన్యాయసభలో దొరతనమువారి న్యాయవాదిగా నుండిరి. ఇతరవిషయములందు సమర్థులైనను, ఆయన యింగ్లీషు రానివారగుటచేత మండలకరగ్రాహితోను తదితరహూణాధికారులతోను నింగ్లీషున నుత్తర ప్రత్యుత్తరములను జరపుటకు సమర్థుఁడైన యొక లేఖకుఁ డాయనకు గావలసి యుండెను. నెల కిరువదిరూపాయల జీత మిచ్చెదననియు, ప్రాతఃకాలమునమాత్రము మూడు గంటలసేపు తనయింటివద్ద పని చేయవలసిన దనియు, ఆయన నన్ను కోరెను. నేనంగీకరించి యాపనిలోఁ బ్రవేశించితిని. ఆయన వేశ్యల నుంచుకొనుట గౌరవావహమని భావించెడు పూర్వ నాగరికకోటిలోనివాఁడు; నేను క్రొత్తకొత్తగా మాఱుచు వేశ్యావిష